TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖల్లో 35 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది.  విద్య, వైద్య, ఆర్టీసీ, ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. 

New Update
tg jobs

Telangana govt 35 thousand jobs Notification release soon

TG JOBS: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. 2024--25 జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖల్లో 35 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది.  విద్య, వైద్య, ఆర్టీసీ, ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. 

జాబ్ క్యాలెండర్ ప్రకారం..

ఈ మేరకు రాష్ట్రంలో SC వర్గీకరణ పూర్తికావడంతో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 2024-25 ఏడాదిలో ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా ఇప్పటికే కీలక మార్పులు చేపట్టింది. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్‌ ప్రకారం ఖాళీల వివరాలు, ఉద్యోగాల భర్తీ సవరణ చేసేందుకు ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తొలి విడతలో 20 వేలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

Also read: టర్కీకి ఓవైసీ సీరియస్ వార్నింగ్.. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలంటూ.. !

Also Read :  దత్తత తీసుకుని పెంచిన తల్లినే.. ఇద్దరు లవర్లతో కలిసి చంపేసింది!

ఇప్పటికే ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ, ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించింది ప్రభుత్వం. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏప్రిల్‌ 14న వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల లెక్క తేల్చేందుకు ప్రక్రియ మొదలుపెట్టింది. టీజీపీఎస్సీ, ఇతర నియామక సంస్థలు ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఎస్సీ ఉపకులాల  సవరణలు సిద్ధం చేశాయి. 

Also Read: పాకిస్థాన్ స్పైగా ఇండియన్ యూట్యూబర్.. మొత్తం ఆరుగురు అరెస్ట్! ఆ రాష్ట్రాల్లో వీరి నెట్ వర్క్

ఇక జాబ్‌క్యాలెండర్‌ ప్రకారం గ్రూప్స్, పోలీసు, టీచర్, గురుకుల, వైద్య, విద్యుత్తు సంస్థలలో నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను కలిపి ఈ నోటిఫికేషన్లు విడుదల చేయనుండగా ఆర్టీసీ, వైద్య విభాగాల్లో 10 వేల పోస్టులు, విద్యుత్తు, ఇంజినీరింగ్‌, వివిధ విభాగాల్లో 2-3, గురుకులల్లో 2 వేలు మొత్త 35వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. 

Also Read :  వర్షిణి కావాలి..  జైలులో పూజలు చేస్తున్న అఘోరీ!

telangana | job-calendar | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు