/rtv/media/media_files/2024/12/14/tiIobdoyQVrouj4QFS2p.jpg)
TGPSC key decision on group 3,4 exams
TG JOBS: గ్రూప్ పరీక్షలపై టీజీపీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రూప్ 3,4 నియామకాల కోసం ఒకే పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే దీనిపై కసరత్తు మొదలుపెట్టింది. ఇక గ్రూప్స్‌తో పాటు వివిధ శాఖల్లో 27వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఖాళీల లిస్ట్ ఫైనల్..
ఈ మేరకు ఇటీవలే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై ఫోకస్ చేసింది. వివిధ శాఖల్లో ఖాళీలకు సంబంధించి పూర్తి నివేదిక తెప్పించుకుంది. ఇందులో భాగంగానే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సివున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది.
రెండింటికీ ఒకే పరీక్ష
అయితే గ్రూప్ 3, 4 ఉద్యోగాల భర్తీ కేవలం వెయ్యి వరకే ఉండగా.. టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు శాఖల ఉద్యోగాలకు ఒకే సిలబస్, క్వాలిఫికేషన్డిగ్రీ ఉండటంతో 3,4కు ఒకే పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. గ్రూప్3 అభ్యర్థులను హెచ్‌వోడీ కార్యాలయాల్లో, గ్రూప్4 అభ్యర్థులను జిల్లా కార్యాలయాల్లో నియమిస్తున్నారు. దీంతో ఈ రెండింటికీ ఒకే పరీక్ష నిర్వహించి నిమాయకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొత్తగా 7వేల జీపీవోలు..
పోలీస్ శాఖలో 14 వేల కానిస్టేబుల్, మరికొన్ని ఎస్ఐ పోస్టులున్నాయి. జెన్‌కో, ట్రాన్స్‌కోతో పాటు వివిధ శాఖల్లో కూడా కలిపి దాదాపు 2 వేల ఇంజనీర్ల పోస్టులున్నాయి. ఇతర సర్వీసులు మరో 2 వేలున్నాయి. ఇవి కాకుండా కొత్తగా 7వేల జీపీవో (గ్రామ పాలనాధికారి) పోస్టులను డైరెక్ట్రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని ప్రభుత్వం ప్లా్న్ చేస్తోంది. VRA, VROలు వివిధ శాఖల్లో అడ్జస్ట్అవగా.. కొత్తగా 5 వేల పోస్టులు భర్తీ చేయాలని చూస్తున్నారు.
Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!
జాబ్క్యాలెండర్ప్రకారం 2025 ఏప్రిల్‌లో పోలీస్, మేలో గ్రూప్–-2, జులైలో గ్రూప్3, ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సివుంది. కానీ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో వీటిని వాయిదా వేయగా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
tgpsc | group exams | telugu-news | today telugu news