TGPSC GROUP-2: గ్రూప్-2 ఫైనల్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ ఇదే!

తెలంగాణ గ్రూప్-2 ఫైనల్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. 783 ఉద్యోగాలకు 777 మంది అర్హత సాధించినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. మే 29 నుంచి జూన్‌ 10వ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికొలస్‌ తెలిపారు. 

New Update
tgpsc

Telangana Group-2 final results released

TGPSC GROUP-2: తెలంగాణ గ్రూప్--2 ఫైనల్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. 783 ఉద్యోగాలకు 777 మంది అర్హత సాధించినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. మే 29 నుంచి జూన్‌ 10వ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికొలస్‌ తెలిపారు. 

పరిశీలనకు గైర్హాజరైతే అంతే..

ఉద్యోగ అర్హుల్లో ఇద్దరు స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులున్నట్లు తెలిపారు. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌ సమీపంలో ఉన్న సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ (పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ)లో  మే 29 నుంచి జూన్‌ 10వ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్టిఫికెట్ పరిశీలన జరగనుంది. ఇక పెండింగ్‌ ధ్రువపత్రాల సమర్పణకు జూన్‌ 11వ తేదీని కమిషన్‌ రిజర్వ్‌ చేసింది. అభ్యర్థుల హాల్‌ టిక్కెట్‌ నంబర్ల వారీగా షెడ్యూల్‌ను మే26న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. అభ్యర్థులు పరిశీలనకు గైర్హాజరైతే తదుపరి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. 

Also Read: #AA22xA6: వామ్మో.! ఒక్క హీరో కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. అట్లీ ప్రాజెక్ట్ పై పెరుగుతున్న అంచనాలు

ఇక 18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 29న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలు మూడుసార్లు వాయిదా పడగా చివరకు 2024 డిసెంబర్‌ 15, 16 తేదీల్లో పరీక్షలు జరిగాయి. 2,49,964 మంది అభ్యర్థులు మాత్రమే నాలుగు పేపర్లు రాయగా 777 మంది  ఉద్యోగాలకు అర్హత సాధించారు. 

esults | telugu-news | today telugu news results 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు