/rtv/media/media_files/2025/05/21/7JlYj31KUlsGdFOMFTcz.jpg)
Home Business BUSINESS 'Honeymoon is over', Gurugram-based founder claims no jobs in US, Canada and UK
చాలామంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తూ సెటల్ అవ్వాలనుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో ఉద్యోగాలు దొరకడం చాల కష్టంగా మారిపోయింది. విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని విద్యార్థులు కలలు కనడం మానుకోవాలని హర్యానాకు చెందిన రాజేష్ సాహ్నీ అనే పారిశ్రామికవేత్త సూచించారు. ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో ఇంటర్నేషనల్ విద్యార్థులకు జాబ్స్ లేవని.. ముఖ్యంగా ఐఐటీ చేసిన ఇంజినీర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Also Read: ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్.. రూ.78 వేల వరకు కేంద్రం సబ్సిడీ
'' అమెరికా, బ్రిటన్, కెనడాలో అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖరీదైన చదువులు చదివించేందుకు కోట్లాది రూపాయాలు ఖర్చు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకవాలి. ముఖ్యంగా ఐఐటీ చదివిన వాళ్లు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసి రెండు లక్షల డాలర్ల శాలరీ వచ్చే జాబ్ చేయాలని అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అది ఏమాత్రం పనిచేయడం లేదని'' రాజేశ్ రాసుకొచ్చారు. రాజేశ్ పోస్టు వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
There are no jobs in USA, Canada and UK for International students.
— Rajesh Sawhney 🇮🇳 (@rajeshsawhney) May 18, 2025
Honeymoon is over, parents should think twice before spending crores on the expensive education.
Engg students especially IITians had an easy hack, do masters in the US and get a $200K starting tech job. This…
Also Read: పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం.. మంత్రి ఇంటికి నిప్పు
2017లో కోర్సు పూర్తయ్యాక కొన్నిరోజుల్లోనే 1.50 లక్షల డాలర్ల ఉద్యోగం దక్కించుకునే ఛాన్స్ ఉండేదని.. ఇప్పుడు గూగుల్ వంటి కంపెనీలు కూడా లేఆఫ్‌లు చేస్తున్నాయని ఓ నెటిజన్ చెప్పారు. మరోవైపు.. బ్రిటన్, అమెరికాతో పాటు ఇటీవల కెనడా కూడా వీసా రూల్స్‌ను కఠినతరం చేసింది. అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగం చేసే గడువును కూడా బ్రిటన్ ఇటీవలే రెండేళ్ల నుంచి 18 నెలలకు తగ్గించింది. ఇక అమెరికా, కెనడాలోని కంపెనీలు కూడా ఇంటర్నేషనల్ విద్యార్థుల కోసం అవకాశాలు తగ్గిస్తున్నాయి. 90 శాతం తన సహచర ఇండియన్ స్టూడెంట్స్ బ్రిటన్‌లో ఉద్యోగాలు దొరకకా భారత్‌కు తిరిగివెళ్లిపోయారని.. బ్రిటన్‌లో మాస్టర్స్ చేసిన జాహ్నవీ జైన్ అనే భారతీయ మహిళ చెప్పారు.
telugu-news | rtv-news | national-news | usa | uk | canada