Dawood Ibrahim: పాకిస్థాన్ నుంచి పారిపోయిన దావూద్ ఇబ్రహీం..
దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
ఇండో-పాక్ యుద్ధంవేళ గుజరాత్ మాజీ సీఎం బల్వంతరాయ్ మెహతా ఘటన తెరపైకొచ్చింది. 1965 యుద్ధ సమయంలో మిథాపూర్ సందర్శన కోసం వెళ్తుండగా పాక్ ఆర్మీ తప్పుడు అంచనాతో ఆయన విమానాన్ని పేల్చివేసింది. దీంతో ఆయన భార్య, ఒక జర్నలిస్ట్, ఇద్దరు సిబ్బంది చనిపోయారు.
మే 9 అంటే పాకిస్థాన్‌కు వణుకు పుడుతోంది. ఎందుకంటే 2023 మే 9న పాక్ మాజీ ప్రధాని అరెస్టుతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో పాక్‌కు రెండు బిలియన్ల పాకిస్థానీ రుపాయల నష్టం వాటిల్లింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి రావడంతో పాకిస్థాన్ భయపడుతోంది.
ఆపరేషన్ సిందూర్‌కి ప్రతీకారంగా పాక్ చైనా ఆయుధాలతో భారత్‌పై దాడికి దిగగా.. ఇండియన్ ఆర్మీ వీటిని తిప్పికొట్టింది. అత్యుత్తమ ఆయుధాలు అయిన JF-17, F-16, HQ-9 లను ఉపయోగించిన భారత్‌ను పాక్ ఢీకొట్టలేకపోయింది. దీంతో పాక్ మళ్లీ నవ్వుల పాలైంది.
జమ్మూలో ఏడుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం అయ్యారు. అర్ధరాత్రి సాంబా జిల్లాలోని సరిహద్దును దాటి మన దేశంలో చొరబాటుకు ప్రయత్నించారు. BSF నిఘా వ్యవస్థ వారిని కనిపెట్టి ఖతం చేసింది. ఉగ్రవాదులకు పాక్ రేంజర్లు మద్దతు పలికి బీఎస్ఎఫ్పై కాల్పులు జరిపారు.
రావల్పిండిపై భారత్ డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. పాక్ 5 జెట్లను భారత్ కూల్చి వేయడంతో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత డ్రోన్లు రావల్పిండిలోకి ఎలా వచ్చాయని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక పోస్టు వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ATMలు 2-3 రోజులు మూసివేయబడతాయని అందులోరాసుంది. ఈ పోస్టుపై PIB స్పందించింది. అది ఫేక్ పోస్ట్ అని ట్వీట్ చేసింది. ATMలు యథావిధిగా పనిచేస్తాయని ప్రజలకు హామీ ఇచ్చింది.
పౌరుషానికి పోయి పాకిస్తాన్ భారత్ తో యుద్ధం చేస్తోంది కానీ...అసలే తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ దేశం ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. భారత్ చేస్తున్న దాడులకు చితికిపోయి మిత్ర దేశాల దగ్గర అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది.
ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నిన్న రద్దైంది. దీనిపై BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా రియాక్ట్ అయ్యారు. భారతీయ, విదేశీ ఆటగాళ్లు, ప్రేక్షకులు, సహాయక సిబ్బంది భద్రతే ముఖ్యమన్నారు. ధర్మశాలలో మ్యాచ్ ఆందోళన కలిగించడంతో రద్దు చేశామని తెలిపారు.