IND-PAK WAR: అప్పు ఇచ్చి ఆదుకోండి ప్లీజ్.. మిత్ర దేశాల వద్ద మోకరిల్లిన పాక్!

పౌరుషానికి పోయి పాకిస్తాన్ భారత్ తో యుద్ధం చేస్తోంది కానీ...అసలే తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ దేశం ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. భారత్ చేస్తున్న దాడులకు చితికిపోయి మిత్ర దేశాల దగ్గర అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది.

author-image
By Manogna alamuru
New Update
pak

Pakistan Economy Fall Down to worst

చాలా రోజులుగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆ దేశంలో గోధుమ పిండి కోసం కూడా కట్టుకున్న ఘటనలు వెలుగు చూశాయి. అలాంటి దాయాది దేశం ఇప్పుడు పూర్తిగా నేలమట్టం అయిపోయే పరిస్థితి దిగజారిపోయింది. భారత్ చేస్తున్న యుద్ధంతో పాకిస్తాన్ నామరూపాల్లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది. 

మమ్మల్ని ఆదుకోండి ప్లీజ్..

దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి చుట్టుకోవడం అంటే ఏంటో ఇప్పుడు పాకిస్తాన్ కు బాగా తెలిసి వచ్చింది. అసలే డబ్బుల్లేక నానా అవస్థలు పడుతున్న ఆ దేశం భారత్ మీదకు ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి కొరివితో తలగోక్కుంది. అటు యుద్ధంలోనూ భారత్ ను ఎదుర్కోలేకపోతుంది. మరోవైపు ఆర్థికంగా కూడా కుక్కపాట్లు పడుతోంది. దీని నుంచి తప్పించుకోవడానికి మిత్రదేశాల దగ్గరకు జోలె పట్టుకుని వెళ్ళింది. భారత్ దాడులతో తీవ్రంగా నష్టపోతున్నామని..తమకు సాయం చేయాలని ప్రపంచ దేశాలను అడుక్కుంటోంది. తమ దేశానికి లోన్ ఇవ్వాలని  అంతర్జాతీయ దేశాలను పాక్ ఆర్థిక శాఖ అడిగింది. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేసింది. భారత్ తో గొడవ మొదలైన దగ్గర నుచీ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఇప్పుడు దాడులతో అక్కడి వారి వ్యాపారాలు కూడా రోడ్డున పడ్డాయి. 

today-latest-news-in-telugu | economy 

Advertisment
తాజా కథనాలు