/rtv/media/media_files/2025/05/09/JcyuiDwBz8xB3bQmtSHr.jpg)
Pakistan Army shot down former Gujarat CM Balwant Rai Mehta plane
IND-PAK WAR: ఇండో-పాక్ యుద్ధంవేళ గతంలో పాక్ చేసిన ఓ పెద్ద పొరపాటు మరోసారి చర్చనీయాంశమైంది.1965 ఇండో-పాక్ యుద్ధంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా ప్రాణాలను బలిగొన్న సంఘటన తెరపైకొచ్చింది. ఆయన భార్య, సిబ్బందితో కలిసి మిథాపూర్‌కు సాధారణ సందర్శన కోసం వెళ్తుండగా పాకిస్తాన్ యుద్ధ విమానం తప్పుడు సమాచారంతో అటాక్ చేసింది. దీంతో భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది.
సందర్శన కోసం వెళ్తుండగా..
భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య ఏదో ఒక చిన్న వివాదం, ఉగ్ర దాడులు, తదితర అంశాలపై ఉత్కంఠ నడుస్తూనే ఉంది. తాజాగా భారత్, పాక్ యుద్ధం తారాస్థాయికి చేరుకోగా..1965 ఇండో-పాక్ యుద్ధంలో గుజరాత్ ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా ప్రాణాలను బలిగొన్న సంఘటన తెరపైకొచ్చింది. 1965 సెప్టెంబర్ 19న బల్వంతరాయ్ మెహతా అహ్మదాబాద్ నుండి బీచ్‌క్రాఫ్ట్ విమానంలో మిథాపూర్‌కు సాధారణ సందర్శన కోసం బయలుదేరాడు. అతనితో పాటు అతని భార్య సరోజ్‌బెన్, సహాయకులు, ఒక జర్నలిస్ట్, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా రాన్ ఆఫ్ కచ్ సమీపంలో ఎగురుతున్నప్పుడు పాకిస్తాన్ రాడార్ దానిని ముప్పుగా భావించింది.
8 మంది దుర్మరణం..
ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పాక్ ఆర్మీ F-86 సాబర్ జెట్‌లతో కూడిన పాకిస్తానీ వైమానిక దళ పైలట్లను దర్యాప్తు కోసం పంపించింది. విమానం అధికారులదని గుర్తించినప్పటికీ దానిని లక్ష్యంగా చేసుకుని కాల్చి వేశారు. దీంతో విమానంలో ఉన్న ఎనిమిది మంది దుర్మరణం చెందారు. రాజనీతిజ్ఞుడు, భారతదేశ పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా అట్టడుగు ప్రజాస్వామ్యాన్ని సమర్థించిన మెహతా మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
అయితే ఈ ఘటనపై పైలట్లలో ఒకరు దశాబ్దకాలం తర్వాత రాసిన లేఖలో వ్యక్తిగత పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. కానీ పాకిస్తాన్ నుండి అధికారిక క్షమాపణ రాలేదు. భారతదేశం ఒక నాయకుడిని కోల్పోవడంతో పౌర జీవితాలకు ఎదురయ్యే విస్తృత ప్రమాదాల గురించి కూడా సంతాపం వ్యక్తం చేసింది. పహల్గామ్ దాడి తర్వాత ఇప్పుడు మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నందున 1965 సంఘటన ఇరుదేశాలకు ఒక హెచ్చరికగా నిలిచింది.
ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు
crime | inida | telugu-news | today telugu news