Dawood Ibrahim: పాకిస్థాన్ నుంచి పారిపోయిన దావూద్‌ ఇబ్రహీం..

దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.

New Update
Dawood Ibrahim

Dawood Ibrahim

 ప్రస్తుతం భారత్-పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి పాకిస్థాన్.. భారత్‌పై డ్రోన్, మిసైళ్లు, ఫైటర్ జెట్లతో దాడులకు యత్నించగా.. వాటిని భారత్ తిప్పికొట్టింది. ఆపరేషన్ సిందూర్‌ ఇంకా కొనసాగుతోంది. దీంతో పాకిస్థాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.  అయితే అండర్‌ వరల్డ్‌ డాన్ అయిన దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. 

Also Read: 'గుజరాత్ సీఎంను కాల్చిచంపిన పాక్ ఆర్మీ'.. సందర్శన కోసం వెళ్తుండగా అటాక్!

గత కొనేళ్లుగా దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉంటున్నాడనే చర్చ నడుస్తోంది. గతంలో పాకిస్థానే అతడిని రక్షించి, కరాచీలో సురక్షితంగా ఉంచిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రతరమైతే భారత భద్రతా దళాలు కరాచీ, ఇస్లామాబాద్‌కు చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో వీటికి భయపడే దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ నుంచి పారిపోయినట్లు ప్రచారం నడుస్తోంది. 

Also Read: సైన్యం ఉగ్రవాదులు చెట్టాపట్టాల్‌...పాక్‌ బండారం బట్టబయలు

మరోవైపు దావుద్ గురించి వస్తున్న వార్తలను భారత భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తున్నాయని తెలుస్తోంది. అయితే దావూద్ పాకిస్థాన్‌లో మరో ప్రాంతంలో దాక్కుని ఉండే అవకాశం ఉందని.. భారత్‌ను తప్పుదారి పట్టించేందుకే అతడు దేశం విడిచి పారిపోయాడని ఉద్దేశపూర్వకంగా పుకార్లు పుట్టిస్తున్నారని కూడా పలువురు భావిస్తున్నారు. ఇదిలాఉండగా గురువారం రాత్రి పాక్‌ దాడులను భారత్‌ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. దీంతో పాకిస్థాన్‌పై మరోసారి భారత్‌ విరుచుకుపడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: రక్తదానాలకు సిద్ధంగా ఉండండి...దేశపౌరులకు పిలుపునిచ్చిన FAIMA

 telugu-news | national-news | dawood-ibrahim

Advertisment
తాజా కథనాలు