IND-PAK WAR: 'చర్చలు జరపండి.. యుద్ధం ఆపండి': బోరున ఏడ్చిన మెహబూబా ముఫ్తీ-VIDEO

భారత్, పాక్ యుద్ధంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇక చాలు.. యుద్ధం ఆపండి'అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికోసం రెండు దేశాలు వెంటనే చర్చలు జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వీడియో వైరల్ అవుతోంది.

New Update
Mehbooba Mufti

IND-PAK WAR Jammu Former CM Mehbooba Mufti cried

IND-PAK WAR: భారత్, పాక్ యుద్ధంపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇక చాలు.. యుద్ధం ఆపండి'అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికోసం రెండు దేశాలు వెంటనే చర్చలు మొదలుపెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వీడియో వైరల్ అవుతోంది. 

పరిస్థితి మరింత దిగజారుతుంది..

ఈ మేరకు తాజాగా మీడియాతో మాట్లాడిన మెహబూబా.. పూర్తిస్థాయి యుద్ధం చేసేందుకు పాకిస్తాన్ ముందుకు రావడం లేదన్నారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య రాజీ కుదరకపోతే కశ్మీర్‌లో పరిస్థితి మరింత దిగజారుతుందని ఆమె అన్నారు. 'భారతదేశం ఒక ఉద్భవిస్తున్న శక్తి. కానీ పాకిస్తాన్ ఆర్థికంగా వెనుకబడి ఉంది. దేశాలను విధ్వంసం వైపు నెట్టడం ఇద్దరూ ఆపాలి. జమ్మూకశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలోఉన్నవారు ప్రతిరోజూ కష్టాలు పడుతున్నారు' అని భావోద్వేగానికి లోనయ్యారు. మన అమ్మ ఇంకా ఎంతకాలం బాధపడుతూనే ఉండాలి? ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలనే మన లక్ష్యం పూర్తైంది. కాబట్టి ఇప్పుడే ఈ యుద్ధం ఆగిపోవాలని కోరారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

అలాగే ఈ యుద్ధంపై మీడియా ఎందుకు తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రచారానికి ఒక పరిమితి ఉంది. రెండు వైపులా మీడియా ప్రతికూల పాత్ర పోషిస్తోందని చెప్పారు. మనం పూర్తిస్థాయి యుద్ధం అంచున ఉన్నామని, ఇద్దరికీ అణ్వాయుధ శక్తులు ఉన్నాయి కాబట్టి.. ఇది అణు యుద్ధంగా మారితే ఏమీ మిగలదని తాను భయపడుతున్నట్లు తెలిపారు. ఇక ఈ మారణహోమంలో అమాయకులు మాత్రమే చంపబడుతున్నారని ఆందోలన వ్యక్తం చేశారు. 'మనం బతకాలి, ఇతరులను బతకనివ్వాలి. పహల్గాం దాడి మనల్ని ఎంతగా ప్రభావితం చేసిందో తెలుసు. కానీ ఇప్పుడు ఈ దాడులు పరిస్థితిని మరింత దిగజార్చాయి. దీనికి యుద్ధం పరిష్కారం కాదు. రాజకీయంగా పరిష్కారం చేసుకోవాలని కోరుతున్నా' అని మెహబూబా ముఫ్తీ అన్నారు.

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

operation sindhoor | jammu kashmir attack | telugu-news | today telugu news | mehbooba-mufti

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు