/rtv/media/media_files/2025/05/09/f8cCq2lFd3zNkE0L7Oye.jpg)
BSF kills seven terrorists in Jammu
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం వేడెక్కింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించింది. దీంతో ఇరు దేశాల మధ్య వార్ టెన్సన్ మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో జమ్మూలో ఇండియన్ ఆర్మీ, పాక్ ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు స్పాట్‌లోనే హతం అయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రవాదులను BSF సైనికులు హతమార్చారు.
సాంబా జిల్లాలోని అర్ధరాత్రి భారీ సంఖ్యలో టెర్రరిస్టులు మన దేశంలో చొరబాటుకు ప్రయత్నించారు. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు నిఘా వ్యవస్థ ద్వారా వారిని కనిపెట్టి ఖతం చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు పాక్ రేంజర్లు మద్దతు పలికి బీఎస్ఎఫ్‌పై కాల్పులు జరిపారు. ఇందులో పాకిస్తాన్ పోస్ట్ ధన్‌ధర్‌ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డ్యామేజ్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2025
జమ్మూలో ఏడుగురు ఉగ్రవాదులు హతం
సాంబా జిల్లాలోని సరిహద్దును దాటుతుండగా ఏడుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చినట్టు తెలిపిన బీఎస్ఎఫ్
పాకిస్తాన్ పోస్ట్ ధన్‌ధర్‌ను డ్యామేజ్ చేసిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్
Source - BSF pic.twitter.com/WX6XNWba6M
ఢిల్లీ నుంచి రైళ్లన్నీ బంద్
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం వేడిక్కడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్ సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ, పంజాబ్, రాజస్తాన్‌లలో హై అలర్ట్ ప్రకటించింది. తాజాగా ఢిల్లీ నగరంలో హైఅలర్ట్ అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా ఇండియా గేట్ వద్ధ అధిక సంఖ్యలో భద్రతను పెంచి కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే రవాణా వ్యవస్థను బంద్ చేశారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు
రైళ్లు, విమానాలు సహా మరిన్ని వాహనాలను నిలిపివేశారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నింటినీ బంద్ చేశారు. వీటితోపాటు ఢిల్లీ నుంచి రాజస్థాన్, గుజరాత్ వెళ్లే వాహనాలను కూడా అధికారులు ఆపేశారు. అదే సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే దాదాపు 90 విమానాలను అనేక ఎయిర్‌లైన్స్ క్యాన్సిల్ చేశాయి.
ind pak war | ind pak war updates | latest-telugu-news | telugu-news