Iran vs Israel : ఇరాన్‌కు మద్దతుగా యుద్ధరంగంలోకి యెమెన్

పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్దంలోకి దిగింది. ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్‌కు మద్దతుగా యెమెన్‌ యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమైంది.

New Update
iran

Israel attack on Iran

పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్దంలోకి దిగడంతో ఇరాన్‌ అతలాకుతలం అవుతోంది. మరోవైపు ఇరాన్‌ పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్‌కు మద్దతుగా యెమెన్‌ యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమైంది. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా ఇరాన్‌తో కలసి పోరాడనుంది.

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

Also Read :  బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే పరుగో పరుగు - ధర చాలా తక్కువ!

Yemen Supports Iran

అమెరికాకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలన్నీ ఒకటి కావాలని ఇరాన్‌ మొదటి నుంచి కోరుతోంది. అయితే ఇరాన్‌కు పాకిస్థాన్‌ వంటి దేశాలు మద్థతు ప్రకటించినప్పటికీ యుద్ధంలో మాత్రం ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు. ఈ క్రమంలో యెమెన్‌ మాత్రం ఇరాన్‌కు మద్ధతుగా తాము యుద్ధంలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యెమెన్‌ సైనిక దళాల అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ యహ్య సరీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించడం గమనార్హం.  ‘యెమెన్‌ అధికారికంగా యుద్ధక్షేత్రంలోకి దిగుతోంది. మా ప్రాదేశిక జలాల నుంచి మీ నౌకలను దూరంగా ఉంచండి’ అని యహ్య సరీ తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

Also Read :  గాంధీభవన్‌లోకి గొర్రెల మంద.. యాదవుల వినూత్న నిరసన ఎందుకంటే?

 

houthis yemen | israel vs yemen | US - Iran Israel War | iran israel war news | iran israel war news today | iran israel war | iran israel latest | iran israel news | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు