Iran-Israel War | ఇంకొక్క తప్పు చేసిన వదిలేది లేదు | Khamenei Strong Warning To America and Israel
ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య భీకర యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ వివరించింది.
పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్దంలోకి దిగింది. ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్‌కు మద్దతుగా యెమెన్ యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమైంది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నప్రస్తుత సమయంలో ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా పేర్కొనే హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకునే దిశగా ఆడుగులు వేస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రపంచం మీద తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో ప్రపంకలను సృష్టిస్తోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా జీ7 దేశాల మద్ధతు కూడగట్టడంలో విజయం సాధించిన ట్రంప్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా యుద్ద రంగంలోకి నేరుగా దూకడానికి సిద్ధమవుతున్నారు.
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఎడతెరపి లేని సైరన్ల మోతతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.