Best Electric Bikes: బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే పరుగో పరుగు - ధర చాలా తక్కువ!

తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుక్కోవాలనుకుంటున్నారా?.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్‌మంటూ తిరిగే బైక్‌లు లక్షలోపు లభిస్తున్నాయి. వాటిలో ఓలా రోడ్‌స్టర్ ఎక్స్, రివోల్ట్ ఆర్వీ1, ఒబెన్ రోర్ EZ, ప్యూర్ EV ఎకోడ్రైఫ్ట్ Z బైక్‌లు ఉన్నాయి.

New Update
best electric bikes under rs 1 lakh

best electric bikes under rs 1 lakh

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరిగిపోతుంది. రోజువారీ పనుల కోసం వాహన ప్రియులు ఎలక్ట్రిక్ బైక్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే మరి మీరు కూడా తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ అందించే ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?. అయితే రూపాయి ఖర్చు లేకుండా కేవలం 3 గంటల ఛార్జింగ్‌తో రయ్ రయ్ మంటూ తిరిగే ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

Ola Roadster X

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల ఓలా రోడ్‌స్టర్ ఎక్స్‌ను లాంచ్ చేసింది. దీనిని  రూ. 99,999(ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 2.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలాగే ఇందులో 7 kW (9.4 బీహెచ్ పవర్) మోటార్ అందించారు. కంపెనీ ఈ కొత్త బైక్ బ్యాటరీపై 3 సంవత్సరాల వారంటీ లేదా 50వేల కి.మీ వారంటీని అందిస్తుంది. 

Oben Rorr EZ

ఒబెన్ రోర్ ఈజెడ్ బైక్ 2.6 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జింగ్ పై 110 కి.మీ మైలేజ్ అందిస్తుంది. బ్యాటరీకి 8 సంవత్సరాలు లేదా 80వేల కి.మీ వారంటీ ఉంది. దీని ధర రూ. 90,000 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. 

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

Pure EV Ecodryft Z

ప్యూర్ ఈవీ ఎకో డ్రిఫ్ట్ జెడ్ బైక్ 3 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 140 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్‌ను రూ. 99,999(ఎక్స్-షోరూమ్) ధరతో కొనుక్కోవచ్చు. కంపెనీ దీనికి మూడు రైడ్ మోడ్‌లు అందించారు. అందులో డ్రైవ్, క్రాస్ ఓవర్, థ్రిల్ వంటివి ఉన్నాయి. 

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

Revolt RV1

రివోల్ట్ మోటార్స్ కంపెనీ తన రివోల్ట్ ఆర్వీ1 బైక్‌ను కేవలం రూ. 90,000(ఎక్స్-షోరూమ్) ధరకే అందుబాటులో ఉంచింది. ఇది 2.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ బైక్‌కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ మైలేజీ అందిస్తుంది. 2 .15 గంటల్లో 80 శాతం ఛార్జ్ అవుతుంది.  కంపెనీ దీని బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 75వేల కి.మీ వారంటీని అందిస్తుంది. 

 

new-electric-bike | Ola Electric Bikes | electric-bike

Advertisment
Advertisment
తాజా కథనాలు