Oil Prices: ఇక భారత్‌కు కష్టకాలమే.. భారీగా పెరిగిన చమురు ధరలు, పడిపోయిన స్టాక్ మార్కెట్లు
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా దిగడంతో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. గడిచిన ఐదు నెలల్లో ప్రస్తుతం గరిష్టంగా క్రూడ్ ఆయిల్ ధరలు చేరాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా తీవ్రంగానే పడింది. జూన్ 23న ట్రేడింగ్‌లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి.
Iran vs Israel : ఇరాన్‌కు మద్దతుగా యుద్ధరంగంలోకి యెమెన్
పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్దంలోకి దిగింది. ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్‌కు మద్దతుగా యెమెన్ యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమైంది.
Israel Vs Iran War Escalates | ఇరాన్ దెబ్బ.. లీటర్ పెట్రోల్ @300 | War Impact On Crude Oil | RTV
ఇండియా రక్షణ వ్యవస్థ సేఫేనా..! | India Defence System | Israel Iron Dome | Iran Israel War | RTV
Iran : తెరుచుకున్న గగనతలం..1000 మంది ఇండియన్స్ రిటర్న్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. దీంతో భారతీయులు ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. భారతీయులను తమ దేశానికి తీసుకెళ్లడానికి భారత్ సిద్దమవడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల కోసం తన గగనతలాన్ని తెరిచింది.
Iran Revolutionary Guards: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ కొత్త చీఫ్
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ పక్పూర్, బ్రిగేడియర్ జనరల్ మాజిద్ ఖాదామిని దాని ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిగా నియమించారు. గత వారం ఇజ్రాయెల్ దాడిలో ఆ స్థానంలో ఉన్న వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే.
ఇరాన్‌తో సరిహద్దుని మూసివేసిన పాకిస్తాన్
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌తో ఆ దేశానికి ఉన్న సరిహద్దుని సోమవారం నుంచి మూసివేసింది. చాఘి, వాషుక్, పంజ్‌గుర్, కెచ్, గ్వాదర్ ఐదు జిల్లాల్లో సరిహద్దు క్లోస్ చేసింది పాకిస్తాన్.
Israel: దెబ్బ తిన్న ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ
ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్ వద్ద ఇంకా 1,600 ఉన్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్‌పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ, వాటన్నింటినీ కూల్చే ఇంటర్సెప్టర్లు ఇజ్రాయెల్ వద్ద లేవు.