/rtv/media/media_files/2025/05/03/0JYQGKN7vglvXuxIheTL.jpg)
khawaja asif
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో పాక్ కు వ్యతిరేకంగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాజాగా పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ భారత్‌ను రెచ్చగొట్టేలా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో సింధు జలాలను అడ్డుకునేందుకు నదిపై భారత్ డ్యామ్ కడితే ఏం చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన ఖవాజా ఒకవేళ భారత్ ఆ పని చేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాక్ ధ్వంసం చేస్తుంది. అని బదులిచ్చారు. ఇండియా దాడికి పాల్పడితే అందుకు రెట్టింపు స్థాయిలో బదులిస్తామని ఇటీవల ఆసిఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Also Read: త్రిశూల శక్తితో ఇండియన్ నేవీ బీభత్సం.. INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్
Pahalgam Terror Attack
అంతేకాదు ఖవాజా ఆసిఫ్ గతంలోనూ పలుసార్లు భారత్ మీద అక్కసును వెళ్లగక్కాడు. భారత్‌పై బురదజల్లే ప్రయత్నాలకు తెర తీశాడు. అంతర్జాతీయ వేదికలపైనా భారత్‌ను బద్నాం చేయడానికి శతవిధాలా శ్రమించాడు. తన కడుపుమంటను బయటపెట్టుకున్నారు. భారతే స్వయంగా ఉగ్రవాదాన్ని పోషిస్తోందంటూ బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం వేశారు. ఒకదశలో చొరబాట్లనూ సమర్థించుకున్నారాయన.
Also Read: మోదీజీ సూసైడ్ బాంబు ఇవ్వండి.. పాకిస్తాన్ వెళ్లి అందరినీ చంపుతా : ముస్లిం మంత్రి
తమ బలగాలను బలోపేతం చేశామని, కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోదలచుకున్నామని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. తమపై భారత్ దాడికి పాల్పడే అవకాశం ఉన్నందున ఆ దేశాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చొరబాటు ఆసన్నమైందని తాను ఎందుకు భావిస్తున్నానో మరిన్ని వివరాలలోకి వెళ్లలేదని ఆయన అన్నారు. పహల్గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందినవారని భారత్ చెప్పడాన్ని ఖవాజా తప్పు పట్టారు ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్ ఇలాంటి ప్రకటనలను చేయడం సరికాదని అన్నారు. దీన్ని తమ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని, తటస్థ దర్యాప్తుకు పిలుపునిచ్చిన విషయాన్ని ఆసిఫ్ గుర్తు చేశారు.
Also Read: నేతలకూ తప్పని టార్చర్..బీజేపీ మహిళా మంత్రికి అసభ్యకరమైన కాల్స్, మెసేజెస్
అయితే గతంలో ఖవాజా మాట్లాడుతూ అమెరికా, పశ్చిమ దేశాల కోసమే తాము గత 3 దశాబ్దాలుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామని ఖవాజా ఆసిఫ్ ఇటీవలే సంచలన కామెంట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చెత్త పనులు చేయకుండా ఉండి ఉంటే పాకిస్థాన్ పరిస్థితి మరోలా ఉండేదని.. తమ దేశం నాశనం అవ్వడానికి ఇదే కారణం అంటూ వివరించారు. అయితే తాజాగా ఈ కామెంట్లపై అమెరికా స్పందించింది. ముఖ్యంగా ఓ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ చేసిన కామెంట్లపై మీరేమంటారని యూఎస్ అధికార యంత్రాంగానికి ప్రశ్న ఎదురు కాగా.. ఆచితూచి సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read: గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్కు మరో షాకిచ్చిన మోదీ
అయితే ఈ పనులు చేయకుండా ఉండి ఉంటే తమ దేశ పరిస్థితి బాగుండేదని వ్యాఖ్యానించారు. అయిత ఉగ్రవాదులను పెంచి పోషించడం అనేది తాము చేసిన పొరపాటు చర్య అని ఆ తర్వాత అర్థమైందన్నారు. ముఖ్యంగా సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాక్ చేరకపోయి ఉంటే.. ఇప్పుడు తిరుగులేనని ట్రాక్ రికార్డ్ ఉండేదని అన్నారు. ఈ కామెంట్లతో ప్రపంచం అంతా షాక్ అయింది. ముఖ్యంగా తమ దేశంలో ఉగ్రవాదమే లేదని, తామే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామంటూ గతంలో చెప్పి.. ఇప్పుడిలా మాట్లాడగా.. పహల్గాం దాడికి పాల్పడింది కూడా ఆ దేశమే అంటూ పలువురు కామెంట్లు చేశారు.
Also Read: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!
india on pahalgam attack | attack in Pahalgam | international news in telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu