/rtv/media/media_files/2025/05/03/MQV9jk6dChrD24z47xt8.jpg)
india-ban
India - Pakistan Import Ban: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తరువాత పాకిస్తాన్ కు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పాక్ తో సింధూ జలాలతో(Indus River) పాటుగా దౌత్య సంబంధాలను తెంచుకున్న భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించింది. పాకిస్తాన్ నుండి రవాణా చేయబడిన అన్ని ఉత్పత్తులకు వర్తిస్తుందనిఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో విదేశీ వాణిజ్య విధానం (FTP) 2023 కు కొత్త నిబంధన జోడించబడింది.
Also Read : Hyderabad: జూబ్లీహిల్స్‌లో 16ఏళ్ల బాలుడిని రేప్ చేసిన యువతి.. అది చేయాలని వేధింపులు
Direct or indirect Import or transit of all goods originating in or exported from Pakistan, whether or not freely importable or otherwise permitted, shall be prohibited with immediate effect. pic.twitter.com/KBamc3DhdW
— ANI (@ANI) May 3, 2025
తక్షణమే అమల్లోకి
జాతీయ భద్రత, పబ్లిక్ పాలసీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దిగుమతులు నిలిపివేయాలని తెలిపింది. దిగుమతుల నిషేధానికి సంబంధించి ఏదైనా మినహాయింపు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా పహల్గామ్ దాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గమైన వాఘా-అట్టారి క్రాసింగ్ ఇప్పటికే మూసివేయబడింది.
Also Read : Hyderabad : సమ్మర్ ఎఫెక్ట్.. హైదరాబాద్లో 60 శాతం పెరిగిన కిడ్నీలో రాళ్ల కేసులు