Suicide Bomb : మోదీజీ సూసైడ్ బాంబు ఇవ్వండి.. పాకిస్తాన్ వెళ్లి అందరినీ చంపుతా : ముస్లిం మంత్రి

పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజడ్‌ జమీర్‌ అహ్మద్‌ తీవ్రంగా స్పందించారు. తనకు ఓ ఆత్మాహుతి బాంబు ఇస్తే పాక్‌పై పోరాటానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా అందుకు అనుమతించాలని మంత్రి జమీర్‌ అహ్మద్‌ కోరారు

New Update
modi-Karnataka-minister

modi-Karnataka-minister

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు కానీ భారత్ నుండి ఏ టైమ్  లోనైనా యుద్ధం జరుగుతుందనే భయంతో పాకిస్తాన్ భయం నీడలో జీవిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటకలోని  మైనారిటీ వ్యవహారాల మంత్రి బీజడ్‌ జమీర్‌ అహ్మద్‌  తీవ్రంగా స్పందించారు. తనకు ఓ ఆత్మాహుతి బాంబు ఇస్తే పాక్‌పై పోరాటానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు.

పాక్‌ ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే 

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అందుకు అనుమతించాలని మంత్రి జమీర్‌ అహ్మద్‌ కోరారు.  పాక్‌ ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమేనంటూ కామెంట్ చేశారు.  'మేము భారతీయులం, మేము హిందుస్తానీలం. పాకిస్తాన్ కు మనతో ఎప్పుడూ ఎలాంటి సంబంధం లేదు. పాకిస్తాన్ ఎప్పుడూ మనకు శత్రువు. మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం నన్ను వదిలేస్తే, నేను పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన కామెంట్స్ చేశారు.జాతీయ భద్రతకు సంబంధించి కేంద్రం బలమైన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Also read : Flights: మూలిగే నక్క మీద తాటి పండు..పాకిస్తాన్ ను వద్దంటున్న విదేశాలు

Also read :  Uttar Pradesh : 21 ఏళ్లకే 12పెళ్లిళ్లు .. పెళ్లి చేసుకున్న గంటకే జంప్!

కాగా  జమ్మూ కశ్మీర్‌లో  ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ దాడిలో విదేశీ పర్యాటకుడితో సహా 26 మంది మరణించగా..  అనేక మంది గాయపడ్డారు. లష్కరేలోని ఒక విభాగమైన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. దీని వెనుక పాక్ ఉందని ఆరోపిస్తూ భారత ప్రభుత్వం అ దేశంతో దౌత్య సంబంధాలను తెంచుకుంది.  

Advertisment
తాజా కథనాలు