యుద్ధానికి సంసిద్ధం అన్నట్లు ఇండియన్ నేవీ సంకేతాలు తెలిపింది. సముద్రంపై తమ బలాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ భారత నావికాదళం శనివారం ఓ సంచలన పోస్ట్ చేసింది. అరేబియా సముద్రంలో మోహరించిన శక్తివంతమైన యుద్ధనౌక ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఉపరితల యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ మూడు ఉన్నాయి. ఈ మూడీటిని కలిపి ఇండియన్ నేవీ శక్తి త్రిశూలంగా అభివర్ణిస్తారు. ఇండియన్ నేవీ చేసిన పోస్ట్‌లో సముద్రం నుంచి ఆకాశానికి.. ఎనీ టైం, ఎనీ వేర్, ఎలాగైనా అని హ్యాష్ ట్యాగ్ చేసింది.
The trident of Naval Power - Above, below and across the waves #FromSeaToSky #AnytimeAnywhereAnyhow pic.twitter.com/HE3Dbdatrz
— IN (@IndiannavyMedia) May 3, 2025
సోషల్ మీడియా Xలోని ఇండియన్ నేవీ ఈ పోస్ట్ పెట్టింది. ఇందులో స్కార్పీన్-క్లాస్ జలాంతర్గామి అయిన డిస్ట్రాయర్, INS కోల్‌కతా, ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ఉన్నాయి. ఇండియన్ నేవీ పవర్ కింద.. మరియు అలల మీద అని క్యాప్షన్‌తో ఈ పోస్ట్ ఉంది. ఇది పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్తత మధ్య త్వరగా వైరల్ అయింది.
(indian-navy | ins indian navy | Indian Navy Attack On Pakistan | post-viral | navy submarine | helicopter | INS Kolkata | pakistan | action on pakistan)