MH: నేతలకూ తప్పని టార్చర్..బీజేపీ మహిళా మంత్రికి అసభ్యకరమైన కాల్స్, మెసేజెస్

లైంగిక వేధింపులకు నేతలూ అతీతం కాదు. ఆడది అయితే చాలు ఎవరైనా లెక్క లేదు. కాల్స్, మెసేజెస్ తో తమ దూల తీర్చుకోవాల్సిందే. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకురాలి పంకజ ముండేకు జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

New Update
MH

Minister Pankaja Munde

చిన్న పిల్లలు..పండు ముసలి..పేద..ధనిక, సాధారణ మహిళ..నాయకురాలు...ఎవరైనా సరే వదిలేది లేదంటున్నారు మగజాతి ఆణిముత్యాలు. ఎలాంటి వాళ్ళకైనా ఆలోచించకుండా లైంగికంగా దాడి చేస్తున్నారు సిగ్గు లేకుండా. తాజాగా మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు పంకజ ముండేకు అనుభవమే ఇందుకు ఉదాహరణ. ఓ వ్యక్తి ఏకంగా మహిళా మంత్రికే అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లు చేసి విసిగించాడు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు చాలా రోజులు ఇలాగే తినేశాడు. దీంతో  తీవ్రంగా విసిగిపోయిన ఆ మహిళా మంత్రి ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.

స్టూడెంట్ ను పట్టుకున్న పోలీసులు

ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని మహారాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ భమ్రే అనే వ్యక్తి.. ఇలా ఒక వ్యక్తి మంత్రి పంకజ ముండేకు మెసేజ్‌, కాల్స్ చేస్తున్నాడని నోడల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంకజ ముండేకు తెలియని వ్యక్తి అసభ్య పదజాలంతో ఫోన్ చేస్తున్నాడని.. ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 78, 79తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు చేసి ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు పుణేలోని ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు. బీడ్ జిల్లాలోని పర్లికి చెందిన అమోల్ కాలే అనే స్టూడెంట్ ఈ చెత్త పని చేాడు. అయితే అతను ఎందుకు ఇదంతా చేశాడు? దీని వెనుక ఉన్న మోటో ఏంటి? అతనికి నాయకురాలు పంకజ ముండేకు ఉన్న సంబంధం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. 

 today-latest-news-in-telugu | minister | sexual-abuse | messages | maharastra | bjp

Also Read: Ind-Pak: పాకిస్తాన్‌పై భారత్ డబుల్ స్ట్రైక్స్‌..ఆర్థికంగా దెబ్బ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు