Italy: విడిపోతున్న ఇటలీ ప్రధాని జంట.. కారణం అదేనటా..
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నారు. పదేళ్ల తమ బంధం ముగిసిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ ప్రకటన చేసింది. అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల గియాంబ్రునో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వళ్లే వారి బంధానికి ముగింపు పడినట్లు సమాచారం. తన భాగస్వామి ప్రవర్తనతో తనపై ఒక అంచనాకు రాకూడదని.. అలాగే ఆయన ప్రవర్తనపై భవిష్యత్తులో తాను ఎలాంటి సమాధానాలు ఇవ్వనని ఇటలీ ప్రధాని జార్జియా ఇప్పటికే స్పష్టం చేశారు.