/rtv/media/media_files/2025/04/18/VLSDQihUqkioRDBh7uoW.jpg)
hijack
విమానం ఆకాశంలో ఉండగా ఓ దుండగుడు హైజాక్ కు యత్నించిన సంఘటన సెంట్ర్ అమెరికాలోని బెలీజ్ లో చోటుచేసుకుంది. కత్తితో బెదిరించి విమానాన్ని తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించగా..మరో ప్రయాణికుడు అడ్డుకుని కాల్పులు జరిపాడు.దీంతో అతడు చనిపోయాడు.
ట్రాపిక్ ఎయిర్ కు చెందిన ఓ చిన్న విమానం గురువారం కొరొజాల్ నుంచి శాన్ పెడ్రోకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కత్తితో బెదిరిస్తూ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. విమానాన్ని దేశం వెలుపలికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశాడు.
Also Read: NIA: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు లష్కరే తొయిబా కుట్ర!
Man Attempts To Hijack Plane
అంతేకాకుండా కొంతమంది ప్రయాణికులను గాయపర్చాడు కూడా. ఆ సమయంలో విమానంలో 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. దుండగుడి చర్యతో వారంతా బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలోనే విమానంలోని మరో ప్రయాణికుడు దుండగుడిని నిలువరించేందుకు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో అతడు మృతి చెందినట్లు బెలీజ్ అధికారులు వెల్లడించారు.హైజాక్ కు యత్నించిన దుండగుడిని అమెరికాకు చెందిన అకిన్యేలా సావా టేలర్ గా గుర్తించారు. అతడు కత్తిని విమానంలోకి ఎలా తీసుకొచ్చాడన్న దాని పై దర్యాప్తు చేపట్టినట్లు బెలీజ్ పోలీసులు వెల్లడించారు.
టేలర్ పై కాల్పులు జరిపిన ప్రయాణికుడిని హీరోగా పేర్కొన్నారు. దుండగుడి చర్యతో విమానం రెండు గంటల పాటు గాల్లో గుండ్రంగా తిరిగింది. అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
Also Read: FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్ సంస్థ సంచలన నిర్ణయం!
plane | hijack | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | international-news | international news in telugu | international news telugu | latest-international-news | america