/rtv/media/media_files/2025/03/23/gTTP3UpzSk1FOl7xKX52.jpg)
Canada PM Mark Carney
ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో కెనడాకు మిగా దేశాలు సహకారం అవసరం అని కెనడా ప్రధాని మార్క్ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ అత్యంత ప్రమాదకారిగా మారారని వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన దిగుమతి సుంకాలను తగ్గించనంత వరకు కెనడా కూడా ప్రతీకార సుంకాలను అమలు చేస్తుందని అన్నారు. 60 బిలియన్లకు పైగా విలువైన దిగుమతులపై కెనడా సుంకాలను విధిస్తుందని చెప్పారు. ఎన్నికల తర్వాత కెనడా యూఎస్ తో కొత్త ఆర్థిక, భద్రతా సంబంధాల పై ట్రంప్ తో చర్చిస్తానని మార్క్ కార్నీ తెలిపారు.
ఇది కూడా చూడండి: AP: వైఎస్ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్
ఇది కూడా చూడండి: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
కెనడా అంతా కలిసి రావాలి..
అమెరికా వాణిజ్య యుద్ధంపై పోరాడేందుకు కెనడా ప్రావిన్సులన్నీ సహకరించాలని ప్రధాని మార్క్ కోరారు. ఏప్రిల్ 28న కెనడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీ నేతలందరూ డిబేట్ లో పాల్గొన్నారు. జరిగిన ఓటింగ్‌కు ముందు కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పోయిలివ్రే, వామపక్ష న్యూ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జగ్మీత్ సింగ్, క్యూబెక్ వేర్పాటువాద బ్లాక్ క్యూబెకోయిస్ అధినేత వైవ్స్-ఫ్రాంకోయిస్ బ్లాంచెట్‌లతో ప్రధాని చర్చలు జరిపారు. మార్క్ కు బ్యాంకింగ్ లో అపారమైన అనుభవం ఉంది. దాంతో సుంకాలను , ట్రంప్ ను ఎదుర్కోవాలని ఆయన భావిస్తున్నారు. పోయిలివ్రే కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడతానని హామీ ఇచ్చారని.. కానీ ట్రూడో నేతృత్వంలోని లిబరల్స్ పాలనలో దశాబ్ద కాలంగా బలహీనమైన ఆర్థిక పనితీరు కెనడాను అమెరికా వ్యతిరేక వాణిజ్య విధానాలకు గురి చేసిందని మార్క్ వాదిస్తున్నారు. ట్రంప్ సంకాల దాడులను అధిగమించాలంటే కెనడాలో అంతర్గతంగా ఉన్న వాణిజ్య హద్దులను మనం చెరిపేసుకోవాలి. దీనికి ప్రావిన్సులు, టెరిటరీల సహకారం కీలకం. అప్పుడే కెనడియన్లకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది అని కార్నీ వ్యాఖ్యానించారు.
Also Read: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
ఇది కూడా చూడండి: FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్ సంస్థ సంచలన నిర్ణయం!
usa | canada | today-latest-news-in-telugu | america president donald trump | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | international news in telugu