/rtv/media/media_files/2025/04/18/ofLZDI2xNuarL7KV8FcV.jpg)
gunturu
అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన వంగవోలు దీప్తి (23) అనే యువతి దుర్మరణం పాలయ్యింది. మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలయ్యింది. దీప్తి కొన్నాళ్ల క్రితం టెక్సాస్ లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో ఎంఎస్ చేసేందుకు వెళ్లింది. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తవుతుంది.
ఈ నెల 12న స్నేహితురాలు మేడికొండూరు కు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డు పై వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు వీరిని ఢీకొట్టింది.దీంతో దీప్తి తలకు తీవ్రగాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి.దీప్తి స్నేహితురాళ్లు ఈ ప్రమాదం గురించి ఆమె తండ్రి హనుమంతరావు కు తెలిపారు.
Also Read: Hari Hara Veera Mallu: వీరమల్లు కోసం పవన్ రేర్ ఫీట్.. ఏకంగా 1100 మందితో
Also Read: Aamir Khan: అమీర్ ఖాన్ తో జెనీలియా స్పెషల్ సాంగ్..
Guntur Student Deepthi Death Incident
ఆయన గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసానిచంద్రశేఖర్ క్యాంప్ ఆఫీసులో సంప్రదించగా...సమాచారాన్ని అమెరికాలో ఉన్న పెమ్మసానికి తెలియజేశారు.వెంటనే పెమ్మసాని తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవు తీసుకున్నారు. గుంటూరులో ఉన్న పెమ్మసానిసోదరుడు రవిశంకర్ తన స్నేహితులు నవీన్ కు క్రౌడ్ ఫండింగ్ వచ్చేలా చూడాలని సూచించారు.
ఆన్ లైన్ లో విరాళాల రూపంలో 80,000 డాలర్ల వరకు రాగా చికిత్సకు వినియోగించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చనిపోయింది. శనివారానికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశాలున్నాయి.ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు పెమ్మసాని రవిశంకర్ తెలిపారు.
దీప్తి తండ్రి హనుమంతరావు చిరు వ్యాపారి.తల్లి రమాదేవి గృహిణి.సోదరి శ్రీలక్ష్మి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతుంది.ఈ నెల 10న దీప్తితో ఫోన్ లో మాట్లాడానని కాలేజీకి వెళ్లాలని చెప్పడంతో ఆదివారం మాట్లాడతానని చెప్పిందని, అవే నాతో మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
చదువులో ఎప్పుడూ ముందుండేదని, పదో తరగతి , ఇంటర్ ఇంజినీరింగ్ లో టాపర్ గా నిలిచిందని,అందుకే కొంత పొలం అమ్మి అమెరికా పంపినట్లు తల్లిదండ్రులు చెప్పారు. కోర్సు పూర్తయ్యి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే సమయానికి మమ్మల్ని కూడా అమెరికా రావాలని కోరగా..ఆ ఏర్పాట్లలో ఉన్నట్లు చెప్పారు.
ఇలా రోడ్డుప్రమాదంలో మృతి చెంది విగతజీవిగా వస్తుందని అనుకోలేదని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: TV OFFERS: కిర్రాక్ ఆఫర్లు.. రూ.2లక్షల వరకు విలువైన టీవీ ఫ్రీ- ఫీచర్లు అదిరిపోయాయ్ మచ్చా!
telugu-news | america | gunturu | international-telugu-news | hit-and-run | latest-telugu-news | deepthi-case | latest telugu news updates | road-accident | andhra-pradesh-news | medical student de*ath | today-news-in-telugu | breaking news in telugu