/rtv/media/media_files/2025/04/27/YyVytKoUnVq9AePnR9um.jpg)
pak railway min
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ తీవ్ర కలత చెందింది. ప్రతిరోజు ఆ దేశానికి చెందిన నాయకులు ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తూనే ఉన్నారు. భారతదేశం ప్రతీకార చర్యకు పాకిస్థాన్ భయపడుతుందని అర్థమవుతోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారత్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Karreguttalu: బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న కర్రెగుట్టలు!
రావల్పిండిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేస్తే, దానికి తగిన సమాధానం ఇస్తామని అన్నాడు.“మా క్షిపణులన్నీ భారతదేశం వైపునకు సిద్ధంగా ఉన్నాయని హనీఫ్ అబ్బాసి అన్నాడు. భారతదేశం ఏదైనా సాహసోపేతమైన చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంటే.. దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. తమ దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు బాంబులు ఉన్నాయని హెచ్చరించాడు.
Also Read: TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. అయితే మీకో చేదువార్త!
తాము గోరీ, షాహీన్, ఘజ్నవి వంటి క్షిపణులను, 130 అణు బాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దౌత్యపరమైన ప్రయత్నాలతో పాటు, తమ సరిహద్దులను రక్షించుకోవడానికి తాము పూర్తి సన్నాహాలు చేస్తున్నామన్నాడు. పహల్గాం దాడి కేవలం ఒక సాకు మాత్రమే అని.. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని భారత్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుందని ఆరోపించాడు.
పాకిస్థాన్ సైన్యం అవసరం అనిపించినప్పుడల్లా రైల్వేను ఉపయోగించుకోవచ్చని హనీఫ్ ప్రకటించాడు. పాకిస్థాన్ రైల్వేలు సైన్యానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నాడు.
Also Read: Pak-India: మాటమార్చిన పాక్ ప్రధాని...దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కశ్మీర్ సీఎం!
Also Read: India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!
pakistan | bharat | nuclear-bomb | pak | railway | minister | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates