/rtv/media/media_files/2025/04/01/3jbKD1FSUUFneIRoA8Md.jpg)
India-pakistan
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తమవుతున్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైతే తమను తాము రక్షించుకునేందుకు బంకర్లలోకి వెళ్లేలా ఏర్పాట్లు మొదలు పెట్టారు. శత్రుమూకల నుంచి రక్షణగా ప్రభుత్వం కొన్నేళ్లుగా బంకర్లను ఏర్పాటు చేస్తూ వస్తోంది.
Also Read: Pak: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్ సైన్యాధిపతి!
ప్రస్తుత ఉద్రిక్త వాతావరణంలో తాము నివసిస్తున్నామని,పంటలను కోసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లనున్నట్లు నివాసితులు మీడియాతో చెప్పారు.గతంలో ఇక్కడ కాల్పులు విరమించండని భద్రతా దళాల నుంచి హెచ్చరికలు వస్తుండేవి.
ఇరు దేశాల ఒప్పందంతో 2021 నుంచి కాల్పులు తగ్గుముఖం పట్టి..ఆ హెచ్చరికలు కూడా తగ్గాయి.ఇటీవల పహల్గాం ఉగ్రదాడితో సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ భద్రతాపరమైన ఆందోళనలు మొదలయ్యాయని స్థానికులు వాపోయారు.ఉద్రిక్తతల నడుమ ఇక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు.ఒక వేళ సరిహద్దు అవతలి నుంచి కాల్పులు జరిపితే...మమ్మల్ని మేం రక్షించుకోవడానికి ఈ బంకర్లను సిద్ధం చేసుకుంటున్నాం.
Also Read: Russia-Ukrain-Putin: ఉక్రెయిన్ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా...ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం పహల్గాం ఆంటి మారణ కాండను మేం ఎప్పటికీ సహించం అని ఓ గ్రామస్థుడు అన్నారు.
కొద్ది రోజులుగా మహిళలు బంకర్లను శుభ్రం చేసే పనిలో ఉన్నారు. పురుషులు గోధుమ పంటను కోసే పనిలో లీనమయ్యారు.ప్రస్తుతం పంట కోత పనుల్లో తీరిక లేకుండా ఉన్నాం. మేం ఆయుధాలు లేని సైనికులం...శత్రువులను ఎదుర్కోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం.
ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలి.అని సరిహద్దు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. పహల్గాం దాడి అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో కాల్పుల విరమణ పాటించాలనే హెచ్చరికలు మళల్లీ వినిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు చెప్పారు.
ఇదిలా ఉంటే..సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది.దాయాది సైన్యం వరుసగా రెండోరోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది.నియంత్రణరేఖ వెబడి పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది.దీన్ని భారతసైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.
ఉగ్రదాడులు,కాల్పుల నుంచి రక్షణగా ప్రభుత్వం ప్రజలకు బంకర్లను ఏర్పాటు చేస్తూ వస్తోంది. పలు జిల్లాల్లో బంకర్లను ఏర్పాటు చేయడానికి 2017లోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.14,460 బంకర్లను నిర్మించాలని సూచించింది. ఆ తర్వాత మరో 4 వేల బంకర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
pahalgam | attack in Pahalgam | pakistan | india | bharat | army | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates