/rtv/media/media_files/2025/04/26/NWtCKtZ125FS6OheEskm.jpg)
Karreguttalu
సుమారు 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత...బ్లాక్ హిల్స్ అనే పేరు. అంతేకాకుండా సాయంత్రం మూడు గంటల నుంచే చీకటి..కనీసం 3 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించడం చాలా కష్టం. అంత దట్టమైన అడవి ఉండటంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితంగా అనుకుంటారు. ఇలాంటి చోట ఆపరేషన్ నిర్వహించే బలగాలకు కత్తిమీదసామే.
Also Read: Pak-India: మాటమార్చిన పాక్ ప్రధాని...దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కశ్మీర్ సీఎం!
శుక్రవారం రాత్రి కర్రెగుట్టల ప్రాంతం బాంబులు మోతతో అల్లకల్లోలంగా ఉందని చుట్టుపక్కల గిరిజనులు చెబుతున్నారు.నిన్న ఉదయం నుంచే హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నట్లు తెలిపారు.గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఒక డీఆర్‌జీ జవాన్‌కు గాయాలు కాగా బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని చత్తీస్‌గడ్ లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు,చిన ఉట్లపల్లి,పెద ఉట్లప్లి, పూజారి కాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read: TTD: వేసవి సెలవుల్లో వీఐపీ, సిఫార్సు లేఖలతో తిరుమల వెళ్తున్నారా.. అయితే మీకో చేదువార్త!
రుద్రారం వరకు 90 కి.మీ పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతూ కొండల పైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి.ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను ,ఆయుధాలను,పెద్దెత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
మరోవైపు ఛత్తీస్‌గఢ్ రిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్‌పై రాష్ట్రంలోని కమ్యూనిస్టులు, పౌరహక్కుల నేతలు, విద్యావేత్తల నుంచి తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కాల్పులను వెంటనే ఆపేయాలని, ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు పదే పదే ప్రతిపాదిస్తున్నా.. కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహించడం సరైన పద్దతి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. తక్షణమే కూంబింగ్‌ను నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
కర్రెగుట్టల్లో పారామిలటరీ దళాలు జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని, మధ్య భారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర నేత, ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. హనుమకొండలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంలో అమాయక ఆదివాసీలే బలవుతున్నారని అన్నారు.
Also Read: BSF jawan : 80 గంటలు, 3 సమావేశాలు.. BSF జవాన్ ఎక్కడ.. పాక్ ఆర్మీ అతన్ని ఏం చేసింది?
karregutta | encounter | latest-news | telugu-news