/rtv/media/media_files/2025/04/18/CwPzN1F61djMqUi6yZok.jpg)
India-China
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చాక పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రతీకార సుంకాల పేరుతో ఆయన చేస్తున్న వాణిజ్య యుద్ధంలో దాదాపు అన్ని దేశాలూ బలౌతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు భారత్ తో తగువులు పడిన చైనా ఇప్పుడు స్నేహ హస్తం చాస్తోంది. అమెరికా మీద యుద్ధం కొనసాగించేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆశా భావం వ్యక్తం చేశారు. దీని కోసం చైనానే ఒక అడుగు ముందుకు వేసింది. తాజాగా భారతీయులకు 85 వేల వీసాలను మంజూరు చేసింది. కేవలం నాలుగు నెలల్లోనే ఇవన్నీ మంజూరు చేసింది. భారతీయుల కోసం చైనా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. 2023 ఏడాది మొత్తంలో భారతీయులకు 1.8 లక్షల వీసాలను మాత్రమే మంజూరు చేసిన చైనా ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే 85 వేలకుపైగా వీసాలు ఇవ్వడం గమనార్హం.
ఇది కూడా చూడండి: AP: వైఎస్ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్
ఆఫర్ల మీద ఆఫర్లు..అమెరికాతో పోలిస్తే..
భారత్ తో చేతులు కలిపేందుకు చైనా తెగ ఉబలాటపడుతోంది. దాని కోసం భారత్, చైనాల మధ్య సంబంధాల వృద్ధికి బాటలు వేస్తోంది. వీసాల మంజూరు ప్రాసెస్ కూడా ఈజీ చేసింది. చైనాకు వెళ్లాలనుకునే భారతీయులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. నేరుగా వీసా సెంటర్ కు వెళ్లి వీసా అప్లికేషన్ ను దరఖాస్తు చేయవచ్చు. కొన్ని రోజుల పాటు మాత్రమే చైనాలో గడపాలనుకునే వారు బయోమెట్రిక్ డేటా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని వల్ల ప్రాసెసింగ్ టైమ్ తగ్గుతుంది. భారతీయ ప్రయాణికులకు చైనా వీసా ధరను కూడా తగ్గించింది. దీని వల్ల తక్కుత ఖర్చుతో చైనాకు వెళ్లొచ్చు. వీసా ధర తగ్గించడం వల్ల ఎక్కువ మంది భారతీయులు చైనాను సందర్శించవచ్చనే భావనలో చైనా ప్రభుత్వం ఉంది. గతంలో చైనా వీసాలకు ప్రాసెసింగ్ టైమ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే వీసాలను జారీ చేస్తోంది. అమెరికాతో పోలిస్తే చైనా బంపర్ ఆపర్లు ఇస్తున్నట్టే. ట్రంప్ వచ్చాక అమెరికా ఇమ్మిగ్రేషన్ చాలా కఠినం చేసేశారు. ప్రతీవీసాకు బోలెడన్ని రూల్స్ పెట్టేశారు. ఇంతకు ముందు కూడా ఫ్రింగర్ ఫింట్, జాబ్ వెరిఫికేషన్, వ్యక్తి వివరాలు ఇలా చాలా వివరాలను ఇవ్వాల్సి ఉండేది. దీంతో పోలిస్తే చైనాకు ఇవేమీ పెద్దగా అక్కర్లేదు. ఫ్రింగర్ ప్రింట్ కూడా అక్కర్లేదని చెబుతున్నారు. అసలు ఇప్పుడు అమెరికా వీసాలు చాలా మట్టుకు రిజెక్ట్ అవుతున్నాయి. మరోవైపు చైనా పిలిచి మరీ వీసాలు ఇస్తోంది.
ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
విద్యార్థుల ఛాయిస్ మారనుందా..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు, తలతిక్క రూల్స్ తో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు నానాపాట్లు పడుతున్నారు. ఎన్నో కలలతో అమెరికా వచ్చిన వారందరూ ఈసురో వాసుదేవుడా అని ఏడుస్తున్నారు. విద్యార్థులపై ప్రతీదనికీ ఆంక్షలు పెట్టడంతో వారి జీవనం రోజురోజుకూ కష్టమైపోతోంది. దానికి తోడు ఇప్పుడు యూనివర్శిటీల మీ కూడా దండయాత్రలు ప్రారంభించారు ట్రంప్. దీంతో అమెరికాలో చదువు మరింత డిఫికల్ట్ అవుతుందని తెలుస్తోంది. దానికి తోడు తాజాగా అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ స్లాట్లు ఆన్‌లైన్ నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 20–25 రోజుల నుంచి వీసా అపాయింట్‌మెంట్ స్లాట్లు దొరకడం గగనంగా మారిందని అంటున్నారు. అమెరికా విద్యా సంస్థల్లో అడ్మిషన్ల సీజన్ డెడ్‌లైన్‌కు గడువు కూడా దగ్గర పడుతోంది.
దీంతో అమెరికాకు పై చదువులకు వెళ్లాలనుకునే వారు ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళడం అవసరమా అని కూడా అనుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు భద్రత లేదని తెలిసి ఎలా పంపుతామని అడుగుతున్నారు. ట్రంప్, ఆంక్షలు, క్రైమ్ వీటన్నింటి మధ్యనా అమెరికాలో చదువుకోకపోతేనేం అని కూడా అంటున్నారు. ఒకవేళ పంపించినా టాప్ ర్యాంక్ యూనివర్శిటీలకు మాత్రమే పంపాలని భావిస్తున్నారు. తమ వారు ఉన్న ప్రాంతాల్లోని యూనివర్శిటీలకు పంపిస్తేనే మంచిదనే తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చూడండి: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
చైనా ఆహ్వానం..ఉన్నత విద్యావకాశాలను పెంచనుందా..
అమెరికా మీద భయంతో విద్యార్థులు, ఉద్యోగులు కూడా వేరే దేశాల వైపు చూస్తున్నారు. కష్టపడి యూఎస్ లో చదువుకునే కంటే మిగా చదువుకుంటే మేలని అనుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా చైనా వీసాల మంజూరును సులభతరం చేయడంతో అక్కడ ఉన్నత విద్యావకాశాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. విదేశాల్లో చదువుకునేందుకు ఇష్టపడే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మధ్య తరగతి ప్రజల్లో ఆదాయం పెరగడం, విదేశాల్లో అధిక జీతాలందించే ఉపాధి అవకాశాలుండటంతో పదేళ్లలో వీరి సంఖ్య రెట్టింపైంది. ఇప్పటివరకు విద్యార్థుల ఛాయిస్ యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాల వైపే ఉండేది. కానీ ఇప్పుడు అది కాస్తా చైనా వైపు మళ్లవచ్చని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఆ దేశాల్లో కంటే చైనాలో విద్య తక్కువ ఖర్చు కూడా అవుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు చైనాకు భారతీయ విద్యార్థులు ఎక్కువగా మెడికల్ కోర్సులు చేయడానికే వెళుతున్నారు. కానీ ఇప్పుడు అన్ని రకాల విద్యలకూ చనాను ఎంపిక చేసుకోవచ్చని చెబుతున్నారు.
చైనాలో విద్య..ఉద్యోగాలు
ఇక్కడ యూనివర్శిటీల్లో ఎక్కువగా ఆర్కిటెక్చర్, కామర్స్, బిజినెస్, ఇంజినీరింగ్, హెల్త్ కేర్ వంటి కోర్సులు పాపులర్ అయ్యాయి. హాంకాంగ్ సగటు IQ 107. హాంకాంగ్ విశ్వవిద్యాలయం సుమారు 37% యాక్సెప్టెన్స్ రేషియోని కలిగి ఉంది. తైవాన్ నిర్వహించే GSAT ఎగ్జామ్ తప్పనిసరిగా పాస్ అవ్వాలి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గావోకావో ఒక కీలకమైన పరీక్ష. తైపీ విశ్వవిద్యాలయం 50% ప్రవేశ రేటును కలిగి ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల నుంచి 15% దరఖాస్తులు ఈ వర్సిటీకి ఇప్పటికైతే వస్తున్నాయి. ఈ పర్శంటేజ్ భవిష్యత్తులో మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే...చైనా ఎప్పుడూ టెక్నాలజీలో ముందుంటుంది. అక్కడ ఇంజనీరింగ్, మెడిసన్ చదివిన వారికి డిమాండ్ అత్యధికం. అంతర్జాతీయ ఉద్యోగావకాశాలకూ కొదవ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా కంపెనీలు మరింత భారతీయులకు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
Also Read: USA: పంజాబ్ లో 14 పేలుళ్ళు..అమెరికాలో నిందితుడు అరెస్ట్
china | india | education | visa | today-latest-news-in-telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu