TN: బాధితులను కలుస్తా, అనుమతివ్వండి..డీజీపీకి లేఖ రాసిన విజయ్
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందారు.
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడుతున్న భారతీయుడు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. ఈ విషయాన్ని నిర్థారించడానికి ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
2027 వరల్డ్ కప్ ఆడటమే తన లక్ష్యమని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో సారి స్పష్టం చేశాడు. తాను కెప్టెన్ గా లేకపోయినా పట్టించుకోనని..జట్టు గెలవడమే తనకు ముఖ్యమని అన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సీరీస్ సవాల్ తో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
హెచ్ 1బీ వీసాదారులు ఇప్పుడు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అంటోంది కాలిఫోర్నియా యూనివర్శిటీ. వీసా రూల్స్ పై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్ 1బీ వీసాల మీద ఉన్న అధ్యాపకులు, సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించింది.
భారత్, పాకిస్తాన్ మధ్య శాంతికి మీరే కారణం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కెనడా ప్రధాని కార్నీ ప్రశంసించారు. ఒక వైపు ఎడతెగని సుంకాల మోత, మరోవైపు నోబెల్ బహుమతుల ప్రకటన...ఈ నేపథ్యంలో కార్నీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.
రాజస్థాన్ లో హైవేపై భారీ యాక్సిడెంట్ జరిగింది. గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించింది. నిన్న అర్థరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్. ఇక మీదట టికెట్ బుక్ చేసుకున్నాక కూడా ప్రయాణ తేదీని మార్చుకోవచ్చని చెప్పింది. అయితే, మార్చుకోవాల్సిన తేదీలో సీట్లు ఖాళీగా ఉంటేనే మార్పు సాధ్యపడుతుంది.
80sలో ఓ ఊపుఊపిన దక్షిణాది నటులు రీసెంట్ గా రీయూనియన్ అయ్యారు. ఫారెస్ట్ అండ్ చిరుత థీమ్ తో ఆడుతూ పాడుతూ గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.