AP: పక్కా ప్లాన్..కంటెయినర్ లో 225 ల్యాప్ టాప్ లు దొంగతనం
బాపట్ల జిల్లాల కొరిశపాడు మండలం మేదరమెట్ల దగ్గర పెద్ద దొంగతనం జరిగింది. పక్కాప్లాన్ ప్రకారం రవాణా అవుతున్న ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. ఏకంగా 225 ల్యాప్ టాప్ లను కొట్టేశారు.
బాపట్ల జిల్లాల కొరిశపాడు మండలం మేదరమెట్ల దగ్గర పెద్ద దొంగతనం జరిగింది. పక్కాప్లాన్ ప్రకారం రవాణా అవుతున్న ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. ఏకంగా 225 ల్యాప్ టాప్ లను కొట్టేశారు.
కర్ణాటక పుణ్యక్షేత్రం ధర్మస్థల లో పెద్ద సంఖ్యలో శవాలు పాతినట్లు చెప్పిన చిన్నయ్య అలియాస్ భీమా మొదటి నుంచీ పెద్ద అబద్ధాల కోరు అని అతని భార్య చెబుతున్నారు. మాండ్యా జిల్లాలో చిక్కబళ్లి గ్రామానికి చెందిన అతడిని దర్యాప్తు బృందం విచారిస్తోంది.
వాషింగ్టన్ డీసీ అయిపోయింది ఇప్పుడు షికాగో...ట్రంప్ అణిచివేతకు ప్లాన్ మొదలైంది. డీసీలో నేరాలను, అక్రమ వలసలను ఆపేందుకు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపిన ట్రంప్ ఇప్పుడు అదే పనిని షికాగో చేయడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ లో మిలటరీ డిప్లాయ్ జరగనుంది.
వచ్చే వారం స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్ల వర్షం కురవనుంది. చాలా పెద్ద కంపెనీలు పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ వంటి పెద్ద కంపెనీతో పాటూ మరో 50 కంపెనీలు బోనస్ షేర్లు ఇస్తున్నాయి.
అమెరికా పాకిస్తాన్ తో తనకున్న గత చరిత్రను మర్చిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ దేశంలో దోస్తీ చేస్తోంది. కావాలని భారత్ ను రెచ్చగొట్టేందుకే అమెరికా పాక్ తో స్నేహం చేస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతి మీద మచ్చ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంతకు ముందు కన్నా అది పెద్దగా కనిపించడం చర్చకు గురి చేస్తోంది. ఆ మచ్చను ట్రంప్ దాచుకోవడం మీద కూడా మాట్లాడుకుంటున్నారు.
స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇక ఆడరంటూ చెలరేగిన పుకార్లకు బీసీసీఐ చెక్ పెట్టింది. వాళ్ళిద్దరూ వన్డేలు ఆడతారు అంటూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కన్ఫార్మ్ చేశారు. 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఉంటారని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ జరగలేదని బుకాయిస్తతూ వచ్చిన పాకిస్తాన్ మొదటిసారి తమ సైనికులకు శౌర్య పతకాలను ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన 138 మంది వీర జవాన్ల లిస్ట్ విడుదల చేసింది. రాహుల్ గాంధీ కి ఈ లెక్కలు చాలా ఇంకా కావాలా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.