/rtv/media/media_files/2025/04/16/jOD7UgxhMgLmgWg5HI6T.jpg)
Boing Jets
అమెరికా, చైనాలు పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ట్రంప్ మొదలెట్టిన వాణిజ్య యుద్ధం తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. మొన్నటి వరకు సుంకాలతో దాడులు చేసుకున్న రెండు దేశాలు ఇప్పుడు మరో అడుగు ముందు వేస్తున్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని చైనా ఎంత మాత్రం ఒప్పుకునేది లేదని చెబుతోంది. చర్చలకు తాము సిద్ధమంటూనే అమెరికాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా పెద్ద షాకే ఇచ్చింది చైనా. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే బోయింగ్ జెట్ విమానాలను ఆపేసింది. వాటిని డెలివరీ తీసుకోవద్దని చైనా ఎయిర్ లైన్స్ కు అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని బ్లూమ్ బర్గ్ న్యూస్ చెబుతోంది. అలాగే అమెరికన్ కంపెనీల నుంచి విమానాల విడిభాగాలు, పరికరాల కొనుగోలును కూడా ఆపేయాలని నిర్దేశించింది.
Also Read : మీ అంతట మీరే వెళ్ళిపోండి..మేము ఖర్చులు భరిస్తాం..ట్రంప్ ఆఫర్
Also Read : స్లిమ్‌గా మారేందుకు ఇంజెక్షన్.. ఖుష్బూ న్యూ లుక్‌పై నెట్టింట రచ్చ రచ్చ!
మార్కెట్లు మటాష్.. బోయింగ్ షేర్లు డౌన్..
అమెరికా టారీఫ్ లను విపరీతంగా పెంచేయడమే దీనికి కారణమని చైనా చెబుతోంది. దీంతో బోయింగ్ విమానాలను లీజుకు తీసుకుని విమానయాన సంస్థలకు ఆర్థికంగా ఊతమివ్వాలని చైనా యోచిస్తోంది. బోయింగ్ అమెరికాకు చెందిన అతిపెద్ద విమాన తయారీ సంస్థ. ఇందులో 30శాతం వరకూ చైనానే కొంటోంది. కానీ ఇప్పుడు సుంకాలు పెంచేయడంతో బోయింగ్ విమానాలు కానీ, వాటి విడి భాగాలు కానీ దిగుమతి చేసుకుంటే విమానయాన సంస్థలకు తడిసిమోపెడవుతోంది. తాజా చైనా నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ ను ప్రభావితం చేసింది. దీని కారణంగా బోయింగ్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి.
Also Read: AP: మూడు సిటీలు కలిపి మెగా సిటీ..చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Also Read : మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి
airplanes | boing | donald trump tariffs | china | usa | today-latest-news-in-telugu | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | breaking news in telugu