Wife Murder: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

కేరళలో మరో భయంకరమైన మర్డర్ జరిగింది. వయనాడ్‌లో జిల్సన్ అనే వ్యక్తి తన భార్య లీషాను ఛార్జింగ్ కేబుల్‌తో గొంతుకోసి చంపేశాడు. అనంతరం తమ ఇద్దరు పిల్లలను ఒక గదిలో బంధించి అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
knife Murder

Kerala Husband killed wife

కేరళలో మరో భయంకరమైన మర్డర్ జరిగింది. వయనాడ్‌లో జిల్సన్ అనే వ్యక్తి తన భార్య లీషాను ఛార్జింగ్ కేబుల్‌తో గొంతుకోసి చంపేశాడు. అనంతరం తమ ఇద్దరు పిల్లలను ఒక గదిలో బంధించి అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

Also Read: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్‌ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!

పిల్లలను ఒక గదిలో బంధించి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం వయనాడ్‌లోని కల్పేట సమీపంలోని పనమారంలో జరిగింది. జిల్సన్ (42) అనే వ్యక్తి తన భార్య (35)లీషాను మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ ఉపయోగించి చంపాడు. దీనికి ముందు అతను తమ ఇద్దరు పిల్లలను ఒక గదిలో బంధించాడు. అయితే భార్య చనిపోయిన తర్వాత జిల్సన్ చెట్టుకు ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది విఫలం కావడతో ఆ తర్వాత విషం తాగి, బ్లేడుతో తన మణికట్టును కోసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో జిల్సన్ తన స్నేహితులకు విషయం ఫోన్ ద్వారా తెలిపాడు. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

జిల్సన్ పరిస్థితి విషమంగా ఉండటంతో కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. మృతురాలిని కెనిచిరలోని కెలమంగళానికి చెందిన లీషాగా గుర్తించారు. ఇక ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక ఇబ్బందులే అతన్ని ఈ నేరానికి ప్రేరేపించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని కెనిచిరా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Also Read: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

 

husband | killed | kerala | today telugu news | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు