Khushbu: స్లిమ్‌గా మారేందుకు ఇంజెక్షన్.. ఖుష్బూ న్యూ లుక్‌పై నెట్టింట రచ్చ రచ్చ!

నటి ఖుష్బూ నెట్టింట తన న్యూ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫొటోల్లో ఆమె సన్నగా కనిపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇంజెక్షన్లతో సన్నబడ్డారు అని ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఖుష్బూ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

New Update
actress Khushbu

actress Khushbu

సీనియర్ నటి, రాజకీయనాయకురాలు ఖుష్భు సుందర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో ఖుష్బూ మోడ్రన్ దుస్తులలో అద్భుతమైన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో సన్నగా, స్టైలిష్ కనిపిస్తూ బ్యాక్ టూ ది ఫ్యూచర్ అని క్యాప్షన్ పెట్టారు. అయితే  ఆమె రూపాంతరం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  కొందరు ఆమె సన్నబడడాన్ని ప్రసంశించగా.. మరికొందరు ఆమె బరువు తగ్గడానికి  ఇంజెక్షన్లు తీసుకున్నారు అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇంజెక్షన్ల మ్యాజిక్  వల్లే ఇలా మారిపోయారు. వాటి గురించి ఫాలోవర్స్‌కు కూడా చెప్పండి’ అంటూ కామెంట్లు పెట్టారు. 

Also Read: Dil Raju: బిగ్ అనౌన్స్మెంట్.. AI స్టూడియోకి దిల్ రాజు శ్రీకారం!

Also Read: Sunny Deol: చర్చిలో రక్తపాతం.. స్టార్ హీరోపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం.. సినిమా బ్యాన్!?

ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటర్

కాగా, దీనిపై ఖుష్బూ స్పందింస్తూ ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు అసలు ఎలాంటి మనుషులు? సోషల్ మీడియాలో మీరెప్పుడూ మీ మొహాలు చూపించరు! ఎందుకంటే అంత అసహ్యంగా ఉంటారు కావున మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తుంది అని రీట్వీట్ చేశారు. 

Also Read: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

Also Read: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్‌ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!

senior-actress-khushbu | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
తాజా కథనాలు