Andhra Pradesh: మూడు సిటీలు కలిపి మెగా సిటీ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్

ఏపీలో అతి పెద్ద సిటీ రానుంది. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగా సిటీగా రానుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి నారాయణ స్వయంగా తెలిపారు. 

New Update
ap

Mega City

ఆంధ్రప్రదేశ్ ను మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఇప్పటికే రాష్ట్రానికి ఎన్నో కొత్త ప్రాజెక్టును, పరిశ్రమలను తీసుకువస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు తాజాగా ఓ మాస్టర్ ప్లాన్ పు సిద్ధం చేశారని పురపాలక మంత్రి పి. నారాయణ చెబుతున్నారు.  అదే మెగా సిటీ అని తెలిపారు. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ వీట్నింటినీ కలిపి ఒకే సిటీగా తయారు చేయాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారు. మెగాసిటీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.  దాని కోసం 5 వేల ఎకరాలు కావాలని, ఆ మేరకు భూమి పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. అయితే ఈ భూసేకరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని...రైతులు నష్టపోక్ుండా భూమిని ఎలా సేకరించవచ్చునో ఆలోచిస్తున్నామని అన్నారు.  5 వేల ఎకరాలు కావాలంటే.. సుమారు 30 వేల ఎకరాల్ని తీసుకోవాలి. దీనిలో రోడ్లు, రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లకు లేఅవుట్లు వేసి, డ్రెయిన్లు కట్టాల్సి ఉంటుంది’ అని వివరించారు. 

Also Read :  హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

Also Read :  షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?

హైదరాబాద్ లా..

హైదరాబాద్ ను తీర్చిదిద్దినప్పుడు కూడా చంద్రబాబు చాలా విమర్శించారు. అక్కడ విమానాశ్రయం కోసం భూములు సేకరిస్తుంటే ఎందుకంటూ ప్రశ్నించారు. కానీ ఇప్పుడది ఎంత గొప్ప ఎయిర్ పోర్ట్ అయిందో అందరూ చూస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ రాబోయే పదేళ్ల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు అమరావతి గురించి కూడా అలానే ఆలోచిస్తున్నారు అన్నారు మంత్రి నారాయణ. మెగాసిటీలో విమానాశ్రయంతో పాటూ అతి పెద్ద స్టేడియం ను కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు. అదే కనుక వస్తే దేశ విదేశాల నుంచి ఆటగాళ్ళు వస్తారు. వారి కోసం మరిన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. ఆ విధంగా సిటీ ఎక్స్పాండ్ అవుతుంది అంటూ నారాయణ చెప్పుకొచ్చారు. అలాగే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సందేహపడక్కర్లేదని..మరో మూడేళ్ళల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కి.మీ. ట్రంక్‌ రోడ్లు నిర్మిస్తాం. రెండున్నరేళ్లలో రైతుల రిటర్నబుల్‌ ప్లాట్ల లేఅవుట్లలోని రోడ్లు, మూడేళ్లలో ఐకానిక్‌ టవర్లు నిర్మిస్తామని వివరాలు చెప్పారు. 

Also Read: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

Also Read :  ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

 

capital | cm-chandra-babu | today-latest-news-in-telugu | andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు