/rtv/media/media_files/2025/05/20/SNxvHIodj5Rt1peNxbXU.jpg)
Russia-Ukraine War
కాల్పుల విరమణకు, యుద్ధాన్ని ముగించడానికి రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలూ సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో తాను రెండు గంటల పాటూ ఫోన్ లో సంభాషించానని...ఆయన శాంతి చర్చలకు ఒప్పుకున్నారని చెప్పారు. తక్షణమే ఇరు దేశాల అధ్యక్షులూ శాంతి చర్చలు చేస్తారని ట్రంప్ చెప్పారు. పుతిన్ తో తన ఫోన్ సంభాషణ చాలా బాగా జరిగిందని...పరిష్కారం దిశగా రష్యా, ఉక్రెయిన్ చర్చలు ప్రారంభిస్తాయని చెప్పారు. చర్చలు ఎంత తొందరగా జరుగుతాయి, నియమాలు ఏంటనేవి వారిద్దరే నిర్ణయించుకున్నారని తెలిపారు. యుద్ధం ముగించాక రష్యాతో పెద్ద ఎత్తున తాను వాణిజ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అలాగే ఉక్రెయిన్ పునర్నిర్మాణంలో కూడా అమెరికా పాత్ర ఉంటుందని చెప్పారు.
Also Read : మనుషుల మూత్రంతో బీర్.. తాగితే స్వర్గమే!
Also Read : ఆర్మూరులో మరో గురుమూర్తి.. కన్నబిడ్డల ముందే భార్య గొంతుకోసి..!
— Donald J. Trump (@realDonaldTrump) May 19, 2025
మేము సిద్ధంగా ఉన్నాం..
సీజ్ ఫైర్ ఒప్పందానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ లో దీని గురించి చర్చించానని..ఎటువంటి ఆంక్షలు లేకుండా ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అయితే రష్యాకు సీజ్ ఫైర్ కు ఒప్పుకునే ఉద్దేశ్యం ఉందో లేదో తెలియదని జెలెన్ స్కీ అన్నారు.
Also Read: Vande Bharat: విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే
Also Read : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు
today-latest-news-in-telugu | peace | ceasefire | russia-ukraine-war | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu