Swedish scientists: మనుషుల మూత్రంతో బీర్.. తాగితే స్వర్గమే!

స్వీడన్ శాస్త్రవేత్తలు మనిషి మూత్రంతో బీర్ తయారు చేస్తున్నారు. మనిషి నుంచి మూత్రాన్ని తీసుకుని దాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఎరువుగా మార్చి మాల్టింగ్ బార్లీను సాగు చేస్తున్నారు. అయితే ఈ మార్కెట్‌లోకి 2027లో వచ్చే అవకాశం ఉంది.

New Update
Beer

Beer

బీర్ అంటే కొందరు పడి చచ్చిపోతారు. వీకెండ్ వస్తే చాలు తాగడం మొదలు పెడతారు. ఇప్పుడున్న రోజుల్లో జెండర్‌తో సంబంధం లేకుండా బీర్‌లు తాగుతున్నారు. అయితే త్వరలో మానవ మూత్రంతో బీర్ తయారు అయ్యే అద్భుతమైన టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. అంతరిక్షంలో, ఎడారి ప్రాంతాల్లో నీరు అందుబాటులో ఉండదు.

ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

మూత్రాన్ని శుద్ధి చేసి బీర్‌గా..

మనిషి తన మూత్రాన్ని శుద్ది చేసి దాన్నే మళ్లీ నీటిగా మార్చే విధంగా పరిశోధనలు చేయగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. స్వీడన్ శాస్త్రవేత్తలు దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. మార్కెట్‌లోకి ఈ బీర్ 2027లో వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వీడన్‌లో ప్రతీ ఏటా ఏప్రిల్ 30న "వాల్పర్గిస్ నైట్" జరుగుతుంది. 

ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..

ఈ సందర్భంగా టాయిలెట్ల నుంచి దాదాపుగా 20,000 లీటర్ల మూత్రాన్ని "స్వీడిష్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (SLU)" కు చెందిన శాస్త్రవేత్తలు సేకరించారు. దీన్ని ముందుగా శుద్ధి చేసి దాంట్లోని 95 శాతం నీటిని తొలగించి కాంసన్ట్రేట్‌గా మార్చారు. ఆ తర్వాత దాన్ని ఎరువుగా మార్చి1.5 హెక్టార్ల వ్యవసాయ భూమిలో వినియోగించారు.

ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు

ఇందులో బీరు తయారీలో ఉపయోగించే ప్రత్యేక జౌ (మాల్టింగ్ బార్లీ) సాగు చేశారు. ప్రస్తుతం ఈ మాల్టింగ్ బార్లీ సాగు దాదాపుగా మూడు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో జరుగుతోంది. అయితే ఇలా సాగు చేసిన బీర్ తాగితే ఆరోగ్యానికి మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు