/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం నెల్లూరులో ఉండగా క్రమంగా అది మచిలీపట్నం వైపు కదులుతోంది. ఈ కారణంగా ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, యానాం, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
కొన్నిచోట్ల వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రాలో కంటే కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..
Daily Weather inference 20.05.2025
— MasRainman (@MasRainman) May 20, 2025
Another widespread Rainy day ahead in #Tamilnadu #Kerala #karnataka #AP & #Telangana.North Kerala & Karavalli Karnataka will get Heavy Rains as well influence of the Persisting CC over NTN/SAP coast.
Chennai will Trend Partly cloudy and… pic.twitter.com/rLyoZVmGja
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
ఈ జిల్లాలో నేడు భారీ వర్షాలు..
నేడు తెలంగాణలో నిజమాబాద్, తాండూరు, మహబూబ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే ఏపీలో రాయలసీమ, యానం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలులో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని తీర ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?
Andhra Pradesh