/rtv/media/media_files/ipAVOUzEpiUlgvkLGxQt.jpg)
దేశంలో ఇప్పటికే చాలాచోట్ల వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెడుతోంది. ఇప్పుడు అందులో మరో కొత్త రూట్ యాడ్ అవనుంది. విజయవాడ, బెంగళూరు ల మధ్య వందే భారత్ ను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇది కార్యరూపం దాలిస్తే దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. మొత్తం ప్రయాణం తొమ్మిది గంటలు ఉండనుందని రైల్వే శాఖ చెబుతోంది. ఈ రైలు కేవలం బెంగళూరు వెళ్ళే వారికే కాకుండా తిరుపతి వేళ్ళే వారికి కూడా ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్.
Also Read : రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!
@RailMinIndia Please Introduce a Vande Bharat trains from Vijayawada to Bengaluru Area (via Tirupati) & Vijayawada to Uttarandhra Region (AP) (via Visakhapatnam).
— MANA VIJAYAWADA (@Mana_Vijayawada) May 15, 2025
Tentative TT is prepared by me for reference
(1)#VandeBharat@drmvijayawada @drmgtl@GMSRailway @SWRRLY pic.twitter.com/qOhE0BAfE4
Also Read : 12 రోజుల తర్వాత వాఘా-అట్టారీ బోర్డర్ లో బీటింగ్ రిట్రీట్
వారానికి ఆరు రోజులు..
మంగళవారం తప్పమిగతా అన్ని రోజులూ నడిచే ఈ రైలు విజయవాడలో 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరు 14.15 గంటలకు చేరుతుంది. తిరిగి అదే రోజు ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరులో 14.45 గంటలకు స్టార్ట్ అయి కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడ 23.45 గంటలకు వస్తుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే వారానికి మూడు రోజులు నడిచే కొండవీడు ఎక్స్ ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది మచిలీపట్నం నుంచి యశ్వంత్ పూర్ మీదుగా నడుస్తోంది.
today-latest-news-in-telugu | vande-bharat-express | vijayawada | bengaluru | train
Also Read: SRH VS LSG: తాను పోయింది...లక్నోను తీసుకెళ్ళిపోయింది
Also Read : తాత మెచ్చిన మనవడు.. నేడు తారక్ 42వ పుట్టిన రోజు