BIG BREAKING: ఆర్మూరులో మరో గురుమూర్తి.. కన్నబిడ్డల ముందే భార్య గొంతుకోసి..!

తెలంగాణలో మరో గురుమార్తి తరహా ఘటన సంచలనం రేపింది. నిజమాబాద్‌ ఆర్మూర్‌కు చెందిన గంగాధర్ అనుమానంతో భార్య అంజలిని గొంతుకోసి చంపాడు. పిల్లలు వద్దని వేడుకుంటున్న వినకుండా దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
murder nzb

Nizamabad Armoor Husband kills wife

తెలంగాణలో మరో గురుమార్తి తరహా ఘటన సంచలనం రేపింది. నిజమాబాద్‌ ఆర్మూర్‌కు చెందిన గంగాధర్ అనుమానంతో భార్య అంజలిని గొంతుకోసి చంపాడు. పిల్లలు వద్దని వేడుకుంటున్న వినకుండా దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది. రెంజర్ల మండలానికి చెందిన ముద్దంగుల గంగాధర్‌కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన అంజలి(35)తో 18 ఏళ్ల పెళ్లైంది. వీరికి స్పందన, ఇందు అనే ఆడపిల్లలున్నారు. అయితే గత రెండేళ్ల క్రితం గొడవల కారణంగా దూరంగా ఉంటున్న వీరు.. బోధన్‌ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు

Also Read :  తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. కీలక ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు మాయం!

Husband Kills Wife

గంగాధర్ ఉపాధికోసం దుబాయ్ వెళ్లగా.. అంజలి పిల్లలతో కలిసి ఆర్మూర్‌లో ఉంటోంది. గత నెలలో ఇంటికి తిరిగొచ్చిన గంగాధర్.. విడాకుల కోసం అంజలిని బోధన్‌ కోర్టుకు రావాలని పిలిచాడు. కానీ నిజమాబాద్ లోనే గంగాధర్ తో గొడవపడిన అంజలి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి ఆర్మూర్‌లోని తను ఉండే ఇంటికి వెళ్లిపోయింది. అయితే తనవెంటే ఆ ఇంటికొచ్చాడు గంగాధర్‌. అక్కడ ఇరువురికి వివాదం జరగగా.. ఇంట్లో ఉండే కత్తితో అంజలి గొంతు కోసేశాడు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు ఇంట్లోనే ఉన్న పిల్లలు.. వద్దు నాన్న అంటూ వేడుకున్న వినలేదు. అంజలి చనిపోగానే పారిపోతుండగా స్థానికులు పోలీసులకు పట్టించారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య, ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ రెడ్డి, సీఐ సత్యనారాయణ తెలిపారు. 

Also read: Corona: మరోసారి విజృంభిస్తున్న మహమ్మారి.. దేశవ్యాప్తంగా 257 కరోనా కేసులు

Also Read :  తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. కీలక ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు మాయం!

 

husband | wife | murder | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు