/rtv/media/media_files/2025/02/12/XmxvQeNNkqvb0szGQxW1.jpg)
PM Modi, USA President Trump
మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు. ఈ మేరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తామన్నారు.
Also Read : అది బొద్దింక కాదు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత
Also Read : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుకూలించని వాతావరణం..పలు విమానాల మళ్లింపు
Trump Warns To PM Modi
'రష్యానుంచి చమురును భారత్, చైనాలు 70శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఆగస్టులో దీనిపై బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారు అని లిండ్సై స్పష్టం చేశారు. ఇక రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తుండగా ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావంపడే అవకాశం ఉంది.
Also Read : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎప్పటి నుంచో తెలుసా?
Alsop Read : కాలు నరికి.. బైక్ పై ఊరేగించిన నిందితులు: భయంకరమైన వీడియో
భారతీయ ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు సమాచారం. మరోవైపు భారత్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనున్నట్లు ట్రంప్ తెలిపారు. తక్కువ సుంకాలతోనే ఈ డీల్ ఉండనుందని, అది ఒక కొత్త డీల్ అవుతుందన్నారు.
russia | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | LATEST BUSINESS NEWS | business news telugu | pm-modi | Donald Trump | telugu politics news | telugu politics live updates