AP Home Minister Anita: అది బొద్దింక కాదు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత

తన ఆహారంలో బొద్దింక వచ్చిందన్న ప్రచారంపై ఏపీ హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. తన భోజనంలో చిన్న తల వెంట్రుక కనిపించిందని.. దానిని వైసీపీ భోజనంలో బొద్దింక ఉందని తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఫేక్ వార్తలను ప్రచారం చేస్తుందని ఫైరయ్యారు.

New Update
AP Home Minister Anitha clarity on cockroach in her food

AP Home Minister Anitha clarity on cockroach in her food

‘‘నేను తినే భోజనంలో బొద్దింక ఉందని వైసీపీ ప్రభుత్వం ఫేక్ వార్తలను ప్రచారం చేస్తుంది. అందులో ఉన్నది బొద్దింక కాదు. ’’ అంటూ హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తాను తిన్న అన్నంలో కనిపించింది ఏంటో తెలిపారు. ఈ మేరకు నక్కపల్లిలోని హోంమంత్రి కార్యాలయంలో అనిత ప్రెస్ మీట్ నిర్వహించారు.

AP Home Minister Anitha

సోషల్ మీడియాలో తన పై వస్తున్న ఫేక్ వార్తలను హోంమంత్రి అనిత ఖండించారు. ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రజలకు మంచిచేసే మా ప్రభుత్వంపై అవాస్తవాలను సోషల్ మీడియాలో ప్రచురించడమే జగన్ ధ్యేయం. పాయకరావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్‌ను నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశాను. అక్కడ మెనూ పాటించలేదని, వార్డెన్ అందుబాటులో లేరని, హాస్టల్ లో సెక్యూరిటీ కూడా లేరని వార్డెన్‌ను సస్పెండ్ చేశాము.

అన్ని హాస్టల్స్‌ను తనీఖీలు చేయమని అధికారులను ఆదేశించాం. మంచిని కూడా చెడులాగ వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అఫీషియల్ పేజ్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భోజనంలో చిన్న తల వెంట్రుక కనిపించింది. దానిని వైసీపీ సోషల్ మీడియాలో బొద్దింక భోజనంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే అయినా హాస్టల్స్‌కు వెళ్ళరా?. శ్రీశైలం ప్రసాదంలో బొద్ధింక అని నిన్న ప్రచారం చేశారు.

ఎదో రకంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారు. మేము చిత్తశుధ్ధితో ఉన్నాము. ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. కార్యకర్త ఉంటే కదా అధికారం వచ్చేది. వైసిపీ వాళ్ళకు మానవత్వం ఉండదా?.. అధికారంలోకి రావాలి.. సీఎం కుర్చీలో కూర్చోవాలనే జగన్‌కు ఒకే ఒక్క ఆలోచన చేస్తున్నారు.’’ అంటూ ప్రెస్ మీట్‌లో చెప్పుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు