క్రైం Boiler Explosion: ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. 22 మందికి తీవ్ర గాయాలు మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఓ ఉక్కు కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాయిలర్ పేలుడు వల్ల కరిగిన ఇనుము కార్మికులపై పడినట్లు పోలీసులు తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident: రోడ్డు దాటుతుండగా ప్రాణాలు తీసిన అతివేగం.. వీడియో వైరల్ హైదరాబాద్‌లోని సూరారం పీఎస్ పరిధిలో రోడ్డు దాటుతున్న అబ్దుల్ సలాం అనే వ్యక్తిని అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దాదాపు 20 మీటర్ల వరకు ఎగిరిపడ్డ అబ్దుల్ సలాం అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్ నడిపిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Watch Video: దారుణం.. ఎన్నారై ఇంట్లో దుండగుల కాల్పులు ఇటీవల అమెరికా నుంచి పంజాబ్‌కు వచ్చిన ఓ ఎన్నారై ఇంట్లో ఇద్దరు దండగులు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. లావాదేవీల వ్యవహారంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Watch Video: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్ మహారాష్ట్రలోని పూణె జిల్లా పౌడ్ అనే గ్రామం వద్ద ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యయి. ఈ హెలికాప్టర్ ముంబయి నుంచి హైదరాబాద్‌కు వెళ్తు్ండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: వరకట్న వేధింపులు తట్టుకోలేక నవ వధువు ఆత్మహత్య ..! హైదరాబాద్ జగద్గిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది.పెళ్ళైన కొద్దిరోజులకే భర్త శేఖర్ వరకట్న వేధింపులు తట్టుకోలేక మనీషా అనే యువతి యాసిడ్ తాగి చనిపోయింది. అయితే శేఖర్ కు పెళ్ళికి ముందే మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. శేఖర్ అల్వాల్ PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG: అత్తమామల ఆస్తిపై కన్నేసిన భర్త.. అందుకు ఒప్పుకోలేదని భార్యను ఏం చేశాడంటే..! మహబూబ్‌నగర్ జిల్లా కిష్టారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అత్తమామల ఆస్తి పంపకాల్లో వాటాకు ఒప్పుకోవడం లేదని భార్యను భర్త గొంతు నులిమి హత్య చేశాడు. డెడ్‌బాడీని డంపింగ్ యార్డులో పడేసి మిస్సయిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కూతురు ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: డాక్టర్ నిర్లక్ష్యం.. కూర్చున్న కుర్చీలోనే ప్రసవించిన గర్భిణి..! నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. గర్భిణి అశ్వినిని పరిశీలించిన వైద్యులు ప్రసవానికి ఇంకా సమయం ఉందన్నారు. ఆమెకు బెడ్ కేటాయించకపోవడంతో కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: దారుణం.. జువైనల్ హోమ్‌లో ఉండే బాలికపై అత్యాచారం.! తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. జువైనల్ హోమ్‌లో ఉండే ఓ బాలిక (14)పై అత్యాచారం జరిగింది. రిషి అనే యువకుడు బాలిక చదువుతున్న నెహ్రూ మున్సిపల్ స్కూల్ వద్దకు వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఒంటిపై గాయాలతో హోమ్‌కి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata : నేను ఎలాంటి తప్పు చేయలేదు.. కోల్‌కతా హత్యాచార నిందితుడు ట్విస్ట్ కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని నిందితుడు సంజయ్ రాయ్ జడ్జితో కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. తనను ఈ కేసులో కావాలనే ఇరికించారని కోర్టుకు నిందితుడు తెలిపినట్లు తెలుస్తోంది. By V.J Reddy 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn