Major Terror Plot Foiled In Punjab: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం..పోలీసుల అదుపులో 10 మంది?

శాంతియుతంగా ఉన్న మనదేశంలో ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు. ఒకవైపు ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరువక ముందే.. పంజాబ్‌లో మరో కుట్రకు ISI కుట్ర చేసింది. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన పంజాబ్ పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు.

New Update
FotoJet (88)

Major terror plot foiled in Punjab

Punjab Terror Plot :  శాంతియుతంగా ఉన్న మనదేశంలో ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు. ఒకవైపు ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడి మరువక ముందే.. పంజాబ్‌లో మరో కుట్రకు ISI కుట్ర(isis-terrorists) చేసింది. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన పంజాబ్ పోలీసులు ఆ కుట్రను భగ్నం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో అలర్ట్‌ అయిన లూధియానా పోలీసులు చేసిన దాడిలో  ఘన విజయం దక్కిందనే చెప్పాలి.పంజాబ్ డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాక్‌ ISI మద్దతుతో గ్రెనేడ్ల దాడులతో మారణహోమానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను లూధియానా కమిషనరేట్ పోలీసులు భగ్నం చేశారు.

Also Read :  పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు.. కోర్టు సంచలన తీర్పు!

Major Terror Plot Foiled In Punjab

ఈ ఆపరేషన్‌లో విదేశీ హ్యాండ్లర్లకు అనుబంధంగా ఉన్న 10 మంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు మలేషియాలో ఉన్న ముగ్గురు మధ్యవర్తుల ద్వారా పాకిస్థాన్ (Pakistan) హ్యాండ్లర్లతో నేరుగా సంబంధాలు కొనసాగించినట్లు పోలీసులు వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో గ్రెనేడ్ దాడులు చేయాలని ప్లాన్‌ చేసుకున్న ముఠాకు చెందిన నిందితులు హ్యాండ్ గ్రెనేడ్లను డెలివరీ చేసుకున్నారు.

ఈ ముఠాకు మనదేశంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు గాను జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో  గ్రెనేడ్ దాడి జరపాలని పాక్‌ ఆధారిత హ్యాండ్లర్లు ఆదేశాలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. దాడికి ఉపయోగించాల్సిన హ్యాండ్ గ్రెనేడ్‌ (Hand grenade)లను తెప్పించుకోవడం, వాటిని సరఫరా చేయడం వంటి సమన్వయం కూడా ఈ నెట్వర్క్ ద్వారా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ప్రస్తుతం ఈ ఉగ్రదాడి కుట్ర ప్లాన్‌ పై పంజాబ్ పోలీసులు విస్తృత దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఇలాంటి ఉగ్ర కుట్రలను ముందుగానే గుర్తించి అడ్డుకునేందుకు భద్రతా విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని డీజీపీ తెలిపారు. కాగా ---వరుస ఉగ్రదాడులతో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీలో సోదాలు నిర్వహిస్తున్నారు.

Also Read: Kurnool Bus Accident: షాకింగ్ విజువల్స్.. కర్నూలు బస్సు ప్రమాదం - వెలుగులోకి సంచలన వీడియో

Advertisment
తాజా కథనాలు