Delhi: ఢిల్లీ పేలుడులో షాకింగ్ ఘటన.. 300 మీటర్ల దూరంలో తెగిపడిన చేయి.. భయపడుతున్న స్థానికులు

ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఉన్న ఓ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో ఉంది. దీంతో పేలుడు జరిగిన సమయంలో దుకాణంపై మోచేతి పడింది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఈ శరీర భాగం మృతి చెందిన వారిలో ఎవరిదని తెలుసుకోనున్నారు.

New Update
Delhi

Delhi

ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో కొన్ని భయానక దృశ్యాలు స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే బ్లాస్ట్ జరిగిన తర్వాత మృతదేహాల మాంసపు ముద్దలు కొన్ని వందల మీటర్ల పడ్డాయి. అయితే తాజాగా తెగిపడిన చేయిని ఓ దుకాణంపై అధికారులు గుర్తించారు. ఎర్రకోట దగ్గర ఉన్న ఓ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో ఉంది. దీంతో పేలుడు జరిగిన సమయంలో దుకాణంపై మోచేతి పడింది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఈ శరీర భాగం మృతి చెందిన వారిలో ఎవరిదని తెలుసుకోనున్నారు. ఈ పేలుడులో చనిపోయిన వారి మృతదేహాలకు అధికారులు పోస్టు మార్టం నిర్వహించారు. పేలుడు తీవ్రత అధికంగా ఉండటం వల్ల చాలా మంది బాడీ పార్ట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో గుర్తించడానికి ఫోరెన్సిక్ అధికారులకు కష్టమవుతుంది.

ఇది కూడా చూడండి: USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో

ఇది కూడా చూడండి: Delhi Blast: రూట్ మార్చిన ఉగ్రవాదులు..టర్కీ నుంచి దాడులకు ప్లాన్

Advertisment
తాజా కథనాలు