Kurnool Bus Accident: షాకింగ్ విజువల్స్.. కర్నూలు బస్సు ప్రమాదం - వెలుగులోకి సంచలన వీడియో

ఏపీలోని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతై.. దాదాపు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనకు బైక్ ప్రమాదమే అసలైన కారణమని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు.

New Update

ఏపీలోని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతై.. దాదాపు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనకు బైక్ ప్రమాదమే అసలైన కారణమని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ బస్సు అగ్ని ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాలకు సంబంధించి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. 

ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. బస్సు అగ్ని ప్రమాదం జరగక ముందు శివశంకర్ డెడ్ బాడీతో ఎర్రిస్వామి రోడ్డు పక్కన నిల్చుని కనిపించాడు. అదే సమయంలో ప్రమాదానికి గురైన బైక్ రోడ్డుపై పడి ఉంది. ఈ క్రమంలో వి.కావేరి ట్రావెల్స్ బస్సు కంటే ముందు మూడు బస్సులు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను తప్పించుకుని పక్కనుంచి వెళ్లాయి. కానీ కావేరి బస్సు మాత్రం ఆ బైక్‌ను లాక్కుంటూ వెళ్లిపోయింది. ఇలా కొంత దూరం వెళ్లిన తర్వాత బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అందుకు సంబంధించిన విజువల్స్ వి.కావేరి బస్సు కంటే ముందు వెళ్లిన బస్సు డాష్ బోర్డు కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు అవి బయటకు రావడంతో సంచలనంగా మారాయి. 

కాగా ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగింది?.. అనే విషయాన్ని గత విచారణలో ఎర్రిస్వామి తెలిపాడు. ఈ ప్రమాదానికి ముందు అంటే సాయంత్రం ఎర్రిస్వామి, తన స్నేహితుడు శివ శంకర్ కలిసి రెండు సార్లు మద్యం సేవించారు. మద్యం తాగిన తర్వాత తెల్లవారుజామున 2.24 గంటల సమయంలో పెట్రోల్ బంక్‌కు వెళ్లి అక్కడ బండిలో పెట్రోల్ కొట్టించారు. అదే క్రమంలో శివ శంకర్ మద్యం మత్తులో బైక్ డ్రైవ్ చేస్తూ అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొట్టాడు. 

దీంతో బైక్ నడుపుతున్న శివశంకర్ ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో బైక్ వెనుక కూర్చున్న ఎర్రిస్వామి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. అప్పుడే ఎర్రిస్వామి మరణించిన తన స్నేహితుడు శివ శంకర్ డెడ్ బాడీని రోడ్డు పైనుంచి పక్కకు లాక్కుని వచ్చాడు. అదే సమయంలో బైక్ రోడ్డుపై పడి ఉంది. 

ఒకవైపు వర్షం, మరోవైపు రోడ్డుకు ఎడమవైపున డెడ్ బాడీతో ఎర్రిస్వామి, కుడివైపున ప్రమాదానికి గురైన బైక్ ఉంది. అప్పుడే ఓ రెండు మూడు బస్సులు అటు వైపు నుంచి వెళ్లాయి. కానీ ఏ బస్సు అక్కడ ఆగలేదు. రోడ్డుపై పడివున్న బైక్‌ను తప్పించుకుని వెళ్లిపోయాయి. కానీ వి.కావేరి బస్సు మాత్రం రోడ్డుపై పడిఉన్న బైక్‌ను ఈడ్చుకుని పోయింది. అది కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్‌లోని పెట్రోల్ లీకై మంటలు చెలగాయి. దీంతో బస్సు క్షణాల్లో దగ్ధమైంది. 

Advertisment
తాజా కథనాలు