BIG BREAKING: ఢిల్లీలో మరోసారి భారీ శబ్ధంతో పేలుడు!

దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుడు సంభించింది. రాడిసన్ సమీపంలో భారీ శబ్ధంతో బ్లాస్ట్ జరిగింది. గతకొన్ని రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు.

New Update
BREAKING

BREAKING

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ శబ్ధంతో పేలుడు సంభించింది. గురువారం ఉదయం ఢిల్లీలోని మహిపాల్‌పూర్ ప్రాంతంలోని రాడిసన్ హోటల్ సమీపంలో పెద్ద శబ్దం వినిపించినట్లు సమాచారం. వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించారు అధికారులు. బస్సు టైర్ పేలడం వల్ల ఈ భారీ శబ్ధం వచ్చిందని అధికారులు గుర్తించారు.

 ఉదయం 9:18 గంటల ప్రాంతంలో ఈ సంఘటనకు సంబంధించి తమకు కాల్ వచ్చింది. పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదని, దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఎర్రకోట పేలుడుతో ఢిల్లీవాసులు బిక్కుబిక్కుమంటూ భయంతో బతుకుతున్నారు. ఎక్కడ ఏ చిన్న అనుమానస్పద కదలికలు ఉన్నా వెంటనే అలర్ట్ అవుతున్నారు. ఈక్రమంలోనే టైరు పేలిన శబ్ధానికి కూడా పోలీసులతో చెప్పారు. అది బాంబు బ్లాస్ట్ అనుకున్నారు. 

రెండు రోజులు క్రితమే ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. తాజాగా మరో బ్లాస్ట్‌పై ఆందోళన నెలకొంది. NIA ఈ వరస పేలుళ్ల వెనుక కుట్రను ఛేధిస్తోంది. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌పై ఎక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

ప్రాథమిక దర్యాప్తులో ఢిల్లీ పోలీసులకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని సౌత్ వెస్ట్ డీసీపీ తెలిపారు. "శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు" అని డీసీపీ తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు