/rtv/media/media_files/2025/11/12/fotojet-72-2025-11-12-16-42-04.jpg)
Twist in Delhi bomb blast case
Delhi Blasts : ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో దేశమంతా హై అలర్ట్ ప్రకటించడానికి కారణమైంది. అసలేం జరిగిందో అర్థం చేసుకునేలోపే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పొయారు. కాగా ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. 26/11 ముంబయి దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ లోనూ ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉగ్రవాదుల టార్గెట్ లిస్ట్‌లో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ వంటి ఇతర ప్రముఖ కట్టడాలు ఉన్నట్లుగా జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రమూకలు కారుతో బ్టాస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్‌లో అనూహ్యంగా మరో అనుమానిత కారు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఆ కారు ఎవరది? ఎక్కడ ఉందనే కోణంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ కారు డాక్టర్ ఉమర్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఆ కారు( ఫోర్డు కారు నెం.DL 10 CK 0458) కోసం దర్యాప్తు బృందాలు వేట కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని పోలీస్ స్టేషన్లను నిఘా సంస్థలు ఇప్పటికే అప్రమత్తం చేశాయి. ఢిల్లీతో పాటు జమ్ముకశ్మీర్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో కారు కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. పోలీసుల అంచనా ప్రకారం కారు ఆచూకీ తెలిస్తే కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Maoists Encounter: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. ఛత్తీష్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్
Follow Us