Bomb Threat: బిగ్ న్యూస్.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ సహా 5 విమానాశ్రయాలకు బెదిరింపు కాల్స్

వారణాసికి వెళ్లాల్సిన ఒక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే విమానాన్ని నిలిపివేశారు. అనంతరం అత్యవసర భద్రతా చర్యలను చేపట్టారు.

New Update
Air India Express flight to Varanasi

Air India Express flight to Varanasi

దేశంలోని విమానయాన రంగంలో ఇటీవల వరుసగా భద్రతా బెదిరింపులు (Bomb Threats) కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express), ఇండిగో (IndiGo) వంటి ప్రధాన విమానాలకు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనను పెంచింది. 

వారణాసి విమానంలో బాంబు బెదిరింపు

ముంబై నుండి వారణాసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX1023) కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించి.. అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో ఉన్న 176 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. అనంతరం అత్యవసర భద్రతా చర్యలను చేపట్టారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కాసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. 

అనంతరం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగింది. ఆపై గంటల తరబడి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని, ఇది కేవలం తప్పుడు బెదిరింపు అని అధికారులు వెల్లడించారు. భద్రతా క్లియరెన్స్ లభించిన తర్వాత విమానం తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 

మరో 5 విమానాశ్రయాలపై భద్రతా ముప్పు

ఇదిలా ఉండగా.. దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు కూడా ఏకకాలంలో ఐదు ప్రధాన విమానాశ్రయాలకు సంబంధించి భద్రతా ముప్పు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం అనే ఐదు ప్రధాన విమానాశ్రయాలకు భద్రతా సంబంధిత సమస్యలను ఇండిగోకు డిజిటల్‌గా అందినట్లు వర్గాలు తెలిపాయి. ఈ బెదిరింపులు సోషల్ మీడియా, ఈమెయిల్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ బెదిరింపులు అందుకున్న వెంటనే ఇండిగో ఎయిర్‌లైన్స్, విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అన్ని చోట్లా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, విమానాలను ఐసోలేషన్ బేలకు తరలించి, ప్రతి లగేజీని, విమాన అంతర్భాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇది కూడా తప్పుడు బెదిరింపు అని అధికారులు వెల్లడించారు. 

Advertisment
తాజా కథనాలు