/rtv/media/media_files/2025/11/12/fotojet-73-2025-11-12-17-27-03.jpg)
drone chase: మహారాష్ట్రలోని అమ్‌రావతి బద్నేరా రోడ్‌లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతోంది. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పెళ్లి మండపంలో ఉన్న వరుడిని ఒక వ్యక్తి కత్తితో పొడిచి పారిపోయాడు. అయితే పారిపోతున్న నిందితులను పట్టుకోవడానికి బాధితుడి తరుపువారు కొంతదూరం వెంబడించాడు. కానీ, వారు కత్తితో బయపెట్టి బైక్ ఎక్కి పారిపోయారు,. అయితే అక్కడే పెళ్లి దృశ్యాలను చిత్రీకరిస్తున్న డ్రోన్ ఆఫరేటర్ మాత్రం తన చేతికి పని చెప్పాడు. ఆ డ్రోన్‌ను నిందితులు పారిపోతున్న వైపు తిప్పాడు. అలా సుమారు 2 కి.మీ వరకు నిందితులను బెంబడించిన డ్రోన్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మహారాష్ట్రలోని అమ్‌రావతి బద్నేరా రోడ్‌లోని ఓ పెళ్లి మండపంలో సోమవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు వ్యక్తులు వరుడు సుజల్ రామ్ సముద్రపై పలుమార్లు కత్తితో దాడిచేశారు. దీంతో వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. తేరుకొని నిందితులను పట్టుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. కానీ, వారు బెక్‌పై ఎక్కి అక్కడ నుంచి పారిపోయారు. అయితే పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలు చిత్రీకరించడానికి ఏర్పాటు చేసిన డ్రోన్‌ను ఆపరేటర్ నిందితులు పారిపోతున్న వైపు మళ్లించడంతో అది వారిని రెండు కిలో మీటర్ల మేర వెంబడించింది.
దీంతో ఈ కేసును ఛేదించడంలో డ్రోన్ దృశ్యాలు కీలకమైన సాక్ష్యాలుగా మారాయి... వీటి సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డీజే పాటల విషయంలో జరిగిన వివాదం కారణంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. డీజే పాటలకు నృత్యం చేస్తున్న సమయంలో వరుడు నిందితులను నెట్టివేశాడు. దీంతో వారి మధ్య వాదన జరిగిందని.ఆగ్రహించిన జితేంద్ర బక్షి అనే యువకుడు వరుడిని కత్తితో పొడిచి.. మరో వ్యక్తితో కలిసి పరారైనట్లు వివరించారు. నిందితులు వరుడి తండ్రిపైనా కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వరుడిని బంధువులు ఆస్పత్రికి తరలించారు. వరుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ!
Follow Us