Murder Case: సామాజిక కార్యకర్తను చంపిన భార్య, అత్త.. కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్ సంచలనం!

ముంబైలో భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. అత్తతో కలిసి కట్టుకున్న ఆవిడ టార్చర్ చేయడంతో సామాజిక కార్యకర్త త్రిపాఠి బాత్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోయాడు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరగగా కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్ ద్వారా హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. 

New Update
mumbai sucide

Mumbai social activist Tripathi Suicide case

ముంబైలో భార్య వేధింపులకు (Wife Torture) మరో భర్త బలయ్యాడు. అత్తతో కలిసి కట్టుకున్న ఆవిడ టార్చర్ చేయడంతో సామాజిక కార్యకర్త త్రిపాఠి బాత్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోయాడు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరగగా వెబ్‌సైట్‌లో అతని సూసైడ్ నోట్ ద్వారా హృదయవిదారకర విషయం వెలుగులోకి వచ్చింది. 

Also Read :  పోసానికి బెయిల్

డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టి..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని సహారా హోటల్‌లో 41 ఏళ్ల నిశాంత్ త్రిపాఠి అనే సామాజిక కార్యకర్త ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డారు. హోటల్ గది బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టి బాత్ రూమ్‌లో ఉరి వేసుకొని చనిపోయాడు. త్రిపాఠి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో హోటల్ సిబ్బంది మాస్టర్ కీ ఉపయోగించి గదిలోకి ప్రవేశించగా ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 

Also Read :  సీఎం కేసీఆర్.. రేవంత్ పేరు మళ్లీ మర్చిపోయిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే రాందాస్!

కంపెనీ వెబ్‌సైట్‌లో లెటర్..

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు సూసైడ్ లెటర్ గుర్తించారు. తన మరణానికి తన భార్య, అత్త కారణమని లెటర్ రాసి కంపెనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు త్రిపాఠి. దీంతో భార్య, అత్తలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లేటర్ లో ఇలా రాసినట్లు వెల్లడించారు. 'హాయ్ బేబీ.. నువ్వు ఇది చదివే సమయానికి నేను శాశ్వతంగా వెళ్లిపోతా. కొంతకాలంగా నీ ప్రవర్తన నాలో ద్వేషం నింపేలా ఉంది. అయినా నిన్ను నేను ద్వేషించలేదు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా. నా చావుకు నీవ్వు, ప్రార్థన అత్త కారణమని మా అమ్మకు తెలుసు. దయచేసి ఆమెను కలవొద్దు. ఈ విషయం తెలియగానే ఆమె కుప్పకూలిపోతుంది. మా అమ్మను ప్రశాంతంగా ఉండనివ్వండి' అని లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు బయటపెట్టారు. 

ఇది కూడా చదవండి: సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!

ఇక త్రిపాఠి చావుపై స్పందించిన అతని తల్లి నీలం చతుర్వేది.. తాను బతికి ఉన్న శవంలా ఉన్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చూడటానికి మనిషిలా కనిపిస్తున్నాను.. తప్పా ఎప్పుడో చనిపోయాను. జీవచ్ఛవంలా బతుకుతున్నా. త్రిపాఠి వ్యక్తిత్వం, అతను చేపట్టిన సామజిక కార్యక్రమాలు ఎంతో గొప్పవి. వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ చతుర్వేది గుండెలవిసేలా రోదిస్తోందని పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Free Bus Ride : ఏపీ మహిళలకు బిగ్ షాక్..ఫ్రీ బస్ బంద్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు