Viral Video: సీఎం కేసీఆర్.. రేవంత్ పేరు మళ్లీ మర్చిపోయిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే రాందాస్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మళ్లీ మర్చిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్ అంటూ ప్రెస్ మీట్లో మాట్లాడారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ సీఎం శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు అంటూ ప్రసంగించారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

New Update
Ponnam Prabhakar CM Revanth Reddy (File Photos)

Ponnam Prabhakar CM Revanth Reddy (File Photos)

వివిధ కార్యక్రమాలు, ప్రెస్ మీట్లలో సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన ఘటనలు ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. వైరా ఎమ్మెల్యే రాందాస్ కూడా ఈ రోజే సీఎం రేవంత్ పేరును మర్చిపోయారు. ఓ సభలో ప్రసంగిస్తూ సీఎం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అంటూ ఆయన తడబడ్డారు. దీంతో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బీఆర్ఎస్ అభిమానులతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా టీం ఈ వీడియోలను విస్తృతంగా షేర్ చేస్తోంది. రేవంత్ రెడ్డికి ఘోర అవమానం అంటూ ట్రోల్ చేస్తోంది. ఇటీవల గచ్చిబౌలిలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్‌ సింగ్ పాల్గొన్న ఓ అధికారిక కార్యక్రమంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

తెలంగాణ సీఎం అంటూ.. రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు యాంకర్. అల్లు అర్జున్ సైతం సీఎం రేవంత్ పేరును మర్చిపోయిన విమర్శల పాలైన విషయం తెలిసిందే. తెలుగు మహాసభల్లో యాంకర్ గా వ్యవహరించిన నటుడు బాలాదిత్య సైతం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి విమర్శలు మూటగట్టుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు